ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో మత్స్యాకారుల ఓట్లు కీలకం. ఈ గంగపుత్రుల యువతలో పవన్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. వారిని ఓటు బ్యాంక్‌గా ామర్చుకునేందుకు పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన పర్యటనలు అధికార పార్టీని కొంత మేర కలవర పెడుతున్న తీరు లో తీర ప్రాంతవాసులను ఆకట్టునేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలినుంచి మత్య్సకార సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 12న యువజన దినోత్సవం సందర్భంగా సిక్కోలు జిల్లా ఎచ్చెర్ల లో యువశక్తి కార్యక్రమానికి సన్నద్ధమయ్యారు.
ఈ మేరకు రాజకీయ వ్యవహరాల కమిటి ఇన్చార్జీ నాదేండ్ల మనోహర్ గత నెలలోనే జిల్లాలో పర్యటించి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఎచ్చెర్ల సిగ్మెంటుకు చెందిన నేతలతో పాటు ప్రధానంగా మత్య్సకారులు పెద్ద ఎత్తున ఆ రోజు కార్యక్రమానికి హజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉత్తరాంధ్రకు చెందిన నేతలను బాధ్యతలు కట్టబెట్టారు. రాష్ట్రంలో తొలికా ర్యక్రమంగా భావించిన జనసేన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మత్య్సకార ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వలసల నివారణ, ఉపాధి మార్గాలపై అవసరమైన సూచనలు, సలహాలు కోరేందుకు వందమంది యువతీ, యువకులతో లావేరు మండలం తాళ్లవలసలో చేపట్టనున్న యువశక్తి కార్యక్రమం ద్వారా మాట్లాడించనున్నట్టు చెప్పకనే చెప్పారు. దీంతో ఈ కార్యక్రమం వాడీవేడీగా సాగనుందని వేరేగా చెప్పనక్కర్లలేదు. జనసేన యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తుంటే అధికార పార్టీ దీన్ని పరోక్షంగా అడ్డుకోవడానికి ప్రయత్నాలు మొదలేట్టిందనే విమర్శలు ఆరంభమయ్యాయి. హడావుడిగా అప్పలరాజు మత్స్యకార ప్రాంతాల్లో పర్యటించి పవన్ ను నమ్మవద్దని ప్రచారం చేయడం ప్రారంభించారు.