జనసేన అధినేత పవన్ కల్యాణ్ … పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసంపై… చర్చ ప్రారంభమయ్యే రెండు గంటల ముందే తెలిసినట్లు… ఉదయమే హడావుడిగా ట్వీట్లు చేశారు. టీడీపీపై ఉన్న కోపంతోనే మోడీ ఏపీకి ఏమీ ఇవ్వడం లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. న్యాయం కోసం పోరాడటానికి పార్లమెంట్ కన్నా…గొప్ప వేదిక ఉండదన్నారు. న్యాయాన్ని “డెలివరీ” చేయాలని కూడా ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నానికి మళ్లీ వెంటనే ట్వీట్లు ప్రారంభించారు. ఈ సారి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం … అంతా పస లేకుండా సాగిందన్నట్లుగా ట్విట్టర్ లో తేల్చి పడేశారు.
అవిశ్వాసంపై టీడీపీ వాదన పవన్ కల్యాణ్ కు చాలా బలహీనంగా కనిపించిందిట. ప్రత్యేక హోదా అంశాన్ని సరైన రీతిలో ప్రస్తావించిలేకపోయారట. పార్టీకోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాజీ పడిందని తేల్చేశారు. ఏపీ ప్రజల మనసును గెలిచే సువర్ణావకాశాన్ని తెలుగుదేశం పార్టీ చేజార్చుకుందని ట్వీట్ తీర్పిచ్చారు. నిజానికి గల్లా జయదేవ్ ప్రసంగాన్ని పార్లమెంట్ సభ్యులే కాదు..జాతీయ టీవీ చానళ్లు కూడా.. బ్రేకులు తీసుకోకుండా ప్రసారం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి సూటిగా తగిలేలా ప్రసంగం ఉందని అభిప్రాయపడ్డాయి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం .. తెలుగుదేశం పార్టీ వాదన చాలా బలహీనంగా ఉందని తేల్చేశారు. గతంలో పవన్ కల్యాణ్ పై… గల్లా జయదేవ్.. వరుస ట్వీట్లతో విమర్శలు చేశారు. అప్పుడే పవన్ కల్యాణ్ వన్ స్పీచ్ వండర్ అంటూ.. సినిమా డైలాగులతో… గల్లా జయదేవ్ పై విమర్శలు కురిపించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా… గల్లా జయదేవ్ పై వ్యక్తిగత విమర్శలు చేశాయి. దీనిపైనా గల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు.
బలమైన వాదన అంటే.. గుడ్డలిప్పదీస్తాం… తరిమికొడతాం.. చొక్కాలు పట్టుకుంటాం… తాటతీస్తాం అనే పదాలతో ఆవేశపడటం కాదని.. తెలుగుదేశం పార్టీ వర్గాలు పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇస్తున్నాయి. పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ ఈలల మధ్య చేసే ప్రసంగాలే బలమైన వాదనలుగా భావిస్తున్నారని అంటున్నారు. ఏదో నోటికొచ్చినట్లు పార్లమెంట్ లో ప్రసంగిస్తే…కుదరదని.. గుర్తు చేస్తున్నారు. గల్లా జయదేవ్ ప్రసంగాన్ని మాత్రమే… విశ్లేషించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత… బీజేపీ స్పందన… ఇతర విషయాలపై మాత్రం ట్వీట్లు బంద్ చేశారు. ఎలాగూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు కాబట్టి… బీజేపీ నేతలు వ్యతిరేక ప్రకటనలు చేసినా.. టీడీపీనే పవన్ నిందించేలా ట్వీట్లు పెడతారని టీడీపీ నేతలు ముందుగానే చెప్పేస్తున్నారు.