పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా `హరి హర వీరమల్లు`. ఈ సినిమా షూటింగ్ పడుతూ, లేస్తూ, ఆగుతూ, ముందుకు సాగుతూ… పోతోంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన సినిమా ఇది. ఇప్పటి వరకూ సరైన అప్డేటే రాలేదు. ఈ సినిమా ఆగిపోయిందని కొందరు, అవుట్ పుట్ నచ్చక… క్రిష్‌పై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశాడని ఇంకొందరు.. ఇలా ఈ సినిమాపై నెగిటీవ్ కామెంట్లు వచ్చాయి. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో నిరుత్సాహంగానే ఉన్నారు.
అయితే ఎట్టకేలకు ‘వీరమల్లు’ నుంచి అప్ డేట్ వస్తోంది. రేపు వినాయక చవితి. సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘వీరమల్లు’కి సంబంధించి వరుస అప్ డేట్లు ఇవ్వాలని చిత్రబృందం భావిస్తోంది. వీరమల్లు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, ఫస్ట్ గ్లిమ్స్ ఇలా….. కొన్ని రెడీ చేసి పెట్టారు. వాటిని ఈ రెండు మూడు రోజుల్లో ఒకొక్కటిగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. వినాయక చవితికి పవన్ లుక్, ఆ తరవాత గ్లిమ్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ పై కూడా ఈ అప్ డేట్లలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్ ఓ దొంగగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది.