ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇటీవల `బంగార్రాజు` ప్రాజెక్టుని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన జీ 5.. మరో రెండు క్రేజీ సినిమాల్ని తన చేతుల్లోకి తీసుకొంది. శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. అయితే వెనుక ఉండి పెట్టుబడి పెడుతున్నదంతా.. జీ 5నే. ఈ సినిమాలో దిల్ రాజు వాటా నామమాత్రమే అని సమాచారం.
పవన్ కల్యాణ్ – సముద్రఖని కాంబినేషన్లో ఓ సినిమా సెట్ అయ్యింది. `వినోదయా సీతమ్`కి ఇది రీమేక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా జీ 5 చేతుల్లోకి వెళ్లిపోయింది. రామ్ చరణ్, పవన్ సినిమాలు రెండూ పెద్ద ప్రాజెక్టులు. అయితే ఇవి కాక మరో ఆరు చిన్న, మీడియం సైజు సినిమాల నిర్మాణంలో జీ 5 కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తానికి తెలుగు సినిమాలపై జీ గ్రూపు గట్టిగానే దృష్టి సారించిందన్నమాట.