ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంగా అసెంబ్లీకి రాకూడదనే నిర్ణయానికి వచ్చారు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయపోరాటం కూడా మొదలుపెట్టేశారు. అయితే ఈ ప్రతిపక్ష హోదా, న్యాయపోరాటం జగన్ కి ఓ కుంటిసాకు మాత్రమే. టెక్నికల్ గా చూసుకుంటే జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదు. మొత్తం సీట్లలోఆయన పార్టీ 10 శాతం సీట్లు సాధించలేనందున ప్రతిపక్ష హోదా టెక్నికల్ గా దక్కే అవకాశం లేదు. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో న్యాయపోరాటం చేసి, సభావ్యవహారాల్లో అంతిమ నిర్ణయం స్పీకర్ దే అని సుప్రీం కోర్టు చెప్పడంతో సైలెంట్ అయిపొయింది. ఇప్పుడు జగన్ కి కూడా తనకి ప్రతిపక్ష హోదా రాదని తెలుసు. అయినా అదేదో ప్రత్యేక హోదా పోరాటంలా చేస్తూ జనాల ముందు మరింతగా చులకనౌతున్నారు.
నిజానికి ప్రతిపక్ష హోదా స్థానం ఇచ్చినపుడు జగన్ దాన్ని లెక్క చేయలేదు. చీటికిమాటికి అసెంబ్లీని బాయ్ కాట్ చేసి క్లాస్ ఎగ్గొట్టినట్లు తన బ్యాచ్ తో కలసి బయటికి వెళ్ళిపోయారు. ప్రతిపక్ష హోదాని భేఖాతరు చేసిన నాయకుల్లో జగన్ ముందు వరుసలో వుంటారు. ఇప్పుడు లేని హోదా కోసం ఆయన పోరాటం చేయడం నవ్వుతెప్పిస్తుంది.
Also Read : పిల్ల కొట్లాటల పిచ్చి రూమర్స్ – వార్డు మెంబర్ల రేంజ్లోనే జగన్ !
అయినా జగన్ కి ప్రతిపక్ష హోదాతో పనేంటో అర్ధం కాదు. ఆయనకి 11 మంది ఎమ్మెలేలు వున్నారు. వారందరికీ నాయకుడిగా సభకు రావచ్చు. తమ వాదన వినిపించవచ్చు. ఈ విషయంలో జగన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి నేర్చుకోవాల్సినది ఎంతైన వుంది. పదిమందిని గెలిపించండి జనసేన తరపున తాను ప్రజల గొంతుకు వినిపిస్తానని కోరేవారు పవన్. ఆ సమయంలో జనసేన నుంచి సభలో వున్న ఒక్కగాను ఒక్క సభ్యున్ని కూడా లాగేసుకున్నారు జగన్. అయినా పవన్ కుంగిపోలేదు. ఏ అధికారం లేకుండానే ప్రజల సమస్యలపై బలమైన గొంతుక వినిపించారు. ఒక ప్రతిపక్షంలానే అధికార పక్షాన్ని ఎండగట్టారు. పవన్ పోరాటన్ని ప్రజలు గుర్తించి ఆయనకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షం గొంతుక వినిపించడానికి జగన్ దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు వున్నారు. అధికారాన్ని చేపట్టిన అనుభవం వుంది. ఇవన్నీ విడిచిపెట్టి లేని,రాని ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తూ మరింత అభాసుపాలౌతున్నారు జగన్ రెడ్డి.