సివిల్ సర్వీస్ అధికారుల్ని బెదిరిస్తే సుమోటోగా కేసుు పెడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలు ఆయన నేరుగా జగన్ రెడ్డికే పంపారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన ఆయన తమ కార్యకర్తలపై కేసులు పెట్టిన వాళ్లను సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకు వస్తామని హెచ్చరించారు. డీజీపీ తిరుమలరావు, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగన్ ఇంటెన్షన్ సులువుగానే అర్థం చేసుకోవచ్చు. వాళ్లను అరెస్టులు చేయకుండా చూడటమే టార్గెట్ .
జగన్ రెడ్డి వస్తాడో రాడో కానీ ఇంకా నాలుగున్నరేళ్లకుపైగా సమయం ఉంది. అప్పటికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అలా అని పోలీసులు రాజకీయ పోలీసింగ్ విషయంలో ఎలా వ్యవహరించాలో జగన్ రెడ్డి తన పాలన ద్వారా చేసి చూపించారు. ఇతరులు అంతకు మించి చేయకపోతే మీకు చేతకాదని అంటారు. అలా అని వైసీపీ కార్య.కర్తలే నిరూపించేందుకు తాపత్రయపడ్డారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రజల్లో వారిపై అసహ్యమే ఉంది కానీ అరెస్టులపై వ్యతిరేకత లేకపోవడంతో జగన్ రెడ్డికే పవన్ కల్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
విధి నిర్వహణలో భయం లేకుండా ఉండే వారి కోసం తాము అండగా ఉంటామని పవన్ కల్యాణ్ తన ప్రకటన ద్వారా నేరుగా సందేశం పంపారు. పవన్ కల్యాణ్ ఈ అంశంపై దూకుడుా ఉన్నారు. జగ న్ రెడ్డి అయినా మరోసారి అధికారుల్ని బెదిరించడానికి… ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు.