పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. సోమవారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకోనున్నారు. అన్న ప్రసాదానికి ఒక రోజు విరాళం అందచేయనున్నారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకుంటారు. సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిన్న గాయాలతో బయటపడ్డారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటానని ఆమె మొక్కుకున్నట్లుగా తెలుస్తోంది. తలనీలాలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్నా లెజ్నోవా స్వతహాగా క్రైస్తవం పాటిస్తున్నప్పటికీ హిందూ దైవాలపైనా అమితమైన భక్తిని చూపిస్తారు. సింగపూర్ అగ్నిప్రమాదంలో పవన్ , అన్నా లెజ్నోవాల చిన్న కుమారుడికి జరిగిన ప్రమాదంలో ఓ పదేళ్ల చిన్న పిల్ల కూడా చనిపోయింది. ఊపిరి తిత్తుల్లోకి పొగ పోవడంతో మార్క్ శంకర్ కూడా ఇబ్బందిపడ్డాడు. రెండు, మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది.
ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు. చిరంజీవిపై అభిమానంతో పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడుకు మార్క్ శంకర్ అని పేరు పెట్టారు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్. బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చేశాయని చిరంజీవి కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత ట్వీట్ పెట్టారు.