టీడీపీ యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదు. గతంలో పదిహేడో తేదీన బహిరంగసభ ఖరారు చేశారు. కానీ తుపాను కారణంగా పాదయాత్రకు మూడు రోజులు పాటు విరామం ఇవ్వాల్సి రావడంతో ఇరవయ్యో తేతీనసభను ఖరారు చేశారు. ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఎన్నికల సన్నాహాక సభగా కావడంతో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఏడు ప్రత్యేక రైళ్ళతో కార్యకర్తలు విశాఖకు తరలి వెళ్లనున్నారు .
ముందస్తు కార్యక్రమాల వల్లనే పవన్ కల్యాణ్ సభకు హాజరు కావడం లేదని టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదే సమయమంలో టీడీపీ నేతలు కూడా.. ఇది యువగళం ముగింపు సభ కాబట్టి.. లోకేష్‌కు క్రెడిట్ ఇచ్చేలా పూర్తస్థాయిలో సభ జరిగితే బాగుంటుందని అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే సన్నాహాలు, ప్రచారం చేస్తున్నారు. పవన్ రాకపోవడం కూడా ఒకందుకు మంచిదే అనుకుంటున్నారు యువగళం ముగింపు సభతోనే టీడీపీ ఎన్నికల ప్రచారభేరీ మోగించినట్లు అవుతుంది.
ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహించే అవకాశం ఉంది. టీడీపీ, జనేసన ఉమ్మడి ప్రచారం కూడా జోరుగా సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా నాగార్జున యూనివర్శిటీ వద్ద నిర్వహించాలనుకున్న సభను రైతులు రద్దు చేసుకున్నారు.