పిఠాపురం ప్రజలు గర్వపడేలా పని చేస్తా : పవన్ కళ్యాణ్

పిఠాపురం ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పిఠాపురంలో సొంతింటి కోసం స్థలం వెతుకుతున్నానని తెలిపారు. పిఠాపురంలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పవన్ కళ్యాణ్.. పిఠాపురం ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని.. ప్రజలంతా గర్వపడేలా పని చేస్తానన్నారు. తానెప్పుడు పదవుల గురించి ఆలోచించలేదని, కష్టాలు ఉన్నప్పడు పని చేసే వ్యక్తిగా నిలబడాలి అనేదే తన అభిమతమని స్పష్టం చేశారు.

జవాబుదారితనంతో కూడిన పాలన అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే సుపరిపాలనను కొనసాగిస్తామని అన్నారు పవన్. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని.. కూటమి సర్కార్ మాత్రం వ్యవస్థలను బలోపేతం చేసి ప్రజలకు చేరువ అవుతుందన్నారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని సైతం వైసీపీ నేతలు దాచుకున్నారు. అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న పవన్ కళ్యాణ్..వాటన్నింటిని తవ్వి బయటకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని, కానీ చేసిన తప్పిదాలను మాత్రం చూసి చూడనట్టు వదిలేయబోమని వెల్లడించారు.

ట్యాక్స్ చెల్లింపు విషయంలో నా అకౌంట్స్ ను చూసుకోని నేను… ప్రజల సంపద, జాతి సంపదను ఆడిటర్ లాగా వెతుకుతున్నా. ఇందులో అధికారులను ఏమాత్రం ఇబ్బంది పెట్టనని.. కానీ ప్రజలకు చెందాల్సిన సంపద విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరిస్తామన్నారు పవన్. ఎన్నికల్లో ఎలాగైతే వందశాతం ఫలితం సాధించామో, ఐదేళ్లలో రక్షిత మంచినీరు లేని ఊరు ఉండొద్దు అనే లక్ష్యంతో పనులు చేపడుతామన్నారు. భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని, తన బిడ్డల కోసం ఎంత తపన పడుతానో కానీ, పేద బిడ్డల భవిష్యత్ కోసం అను నిత్యం ఆలోచిస్తూనే ఉంటానని పవన్ స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీ పీసీసీ చీఫ్ పదవిపైనా పీట ముడి !

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించడానికి హైకమాండ్ తంటాలు పడుతోంది. రేవంత్ ను ఇబ్బంది పెట్టని బీసీ నేతను ఎంపిక చేయాలని నిర్ణయించారు. చివరికి మహేష్...

కొబ్బ‌రికాయ కొట్టారు… రిలీజ్ డేట్ చెప్పారు!

ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లేంత వ‌ర‌కే నిర్మాత చేతిల్లో ఉంటుంది. రిలీజ్ డేట్ పరిస్థితుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డం, ఆ త‌ర‌వాత వాయిదా వేయ‌డం ఈమ‌ధ్య మ‌రీ కామ‌న్ అయిపోయింది....

అయిననూ ద్వారంపూడి మారలే!

ప్రభుత్వం మారినా, పవర్ చేజారినా కొంతమంది వైసీపీ నేతలు మాత్రం ఇంకా దూకుడు తగ్గించడం లేదు. ఇటీవల దమ్ముంటే తమను టచ్ చేసి చూడాలంటూ కొడాలి నాని కేవలం వ్యాఖ్యలకు మాత్రమే పరిమితమైతే...

బెజవాడ ఎయిర్ పోర్టు కళకళ

విజయవాడ ఎయిర్ పోర్టు మళ్లీ రద్దీగా కనిపిస్తోంది. విమాన సర్వీసుల సంఖ్య నెల రోజుల్లోనే పెరిగిపోయింది. కొత్త ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు దేశ విదేశీ ప్రముఖులు తరలి వస్తున్నారు. రాష్ట్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close