చంద్రబాబునాయుడు మరో పదేళ్లు సీఎంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నానని సీఎం చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తామన్నారు. సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని .. మేం చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలని.. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.
సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చని విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని దగ్గర ఉండి నడిపిన తీరు అభినందనీయమని పవన్ అన్నారు. పవన్ ఇలా చెప్పడంతో కూటమిలో విబేధాలు రావడం అనేది సమీప భవిష్యత్ లో సాధ్యం కాదన్న సంకేతాలు పంపినట్లు అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసంతృప్తి స్వరాలు వినిపించినా అది కూడా తదుపరి చర్యల కోసం వ్యూహాత్మకమేనన్న అభిప్రాయం వినిపిస్ోతంది.
చంద్రబాబు నాయకత్వం విషయంలో పవన్ కల్యాణ్ చాలా స్పష్టతతో ఉన్నారు. ఎక్కడా ఎలాంటి ఊహాగానాలు రానివ్వడం లేదు. పవన్ కాబోయే సీఎం అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే వారికి.. పవన్ హిందూత్వం వెనుక బీజేపీ ఉందని బీజేపీ సాయంతో సీఎం అవుతారని ప్రచారం చేస్తున్న వారికీ చెక్ పెట్టినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.