వైసీపీకి ఎంత ఎదురుగాలి వీచినా గిరిజన ప్రాంతాల్లో మాత్రం పట్టు నిలుపుకుంది. అరకు పార్లమెంట్ సీటును గెల్చుకుంది. అరకు, పాడేరు ఎమ్మెల్యే సీట్లనూ గెల్చుకుంది. సిక్కోలు నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి వచ్చిన రెండు సీట్లు అవే. పార్టీ అభ్యర్థులు బలమైన వారు కాదు. పార్టీ బలం మీదనే వారు గెలిచారు. ఇప్పుడు ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన వర్గాల్లో వైసీపీని పూర్తి స్థాయిలో దెబ్బకొట్టేందుకు పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు.
ఇటీవల గిరిజన ప్రాంతాల్లో పవన్ పర్యటించారు. ఓట్లు వేయకపోయినా మీకు సమస్యలు తీరుస్తామని చెప్పారు. ఓట్లు వేసిన వాళ్లు గిరిజనుల్ని దోచుకున్నారని .. అటవీ సంపదను తరలించారని.. ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించుకున్నారు కానీ యాభై కోట్లు పెట్టి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయలేదని ఆరోపించారు. ఈ మాటలన్నీ గిరిజనులలో మార్పు తెచ్చేందుకు చేసిన ప్రయత్నమేనని చెప్పక తప్పదు.
గిరిజన ప్రాంతాల్లో వైసీపీ బలంగా ఉండటానికి కారణం మత మార్పిడులు. గిరిజనులలో ఒకప్పుడు క్రిస్టియానిటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు గిరిజనులలో మెజార్టీని క్రైస్తవ మతంలోకి మార్చేశారు. ఈ కారణంగానే వైసీపీ బలంగా ఉంది. ఈ మతభావనను.. వారిబతుకుల్ని బాగు చేయడం ద్వారా మార్చి.. వైసీపీకి ఆ పునాదీ లేకుండా చేయాలని పవన్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రోడ్లే..రేపు ఉపాధి సౌకర్యాలు పెంచి వారికి ప్రబుత్వం ఏం చేయగలదో చూపిస్తారని అంటున్నారు.