ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పవన్ కల్యాణ్ లేఖరాశారు. అదీ కూడా వైసీపీ అవినీతిపై. ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని తన 5 పేజీల లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో భూ సేకరణ పేరిట రూ.32,141 కోట్లు దుర్వినియోగం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారని లేఖలో తెలిపారు.
గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సైతం లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదని లేఖలో పవన్ తెలిపారు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తైతే 86,984 మందికే ఇచ్చారన్నారు. ప్రభుత్వం తీరుతో మిగతా లబ్ధిదారులు విసుగుచెందారు’ అని పవన్ తన లేఖలో పేర్కొన్నారు అన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు. పవన్ కల్యాణ్ ఈ లేఖ రాజకీయవర్గల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఇది ఆషామాషీ లేఖ కాదని.. పొత్తుల గురించి చర్చలు బయటకు వచ్చిన సమయంలో రాసిన లేఖ రాయడం వెనుక వ్యూహం ఉందని భావిస్తున్నారు.
వైసీపీతో దూరమని బీజేపీ నిరూపించుకుంటేనే పొత్తులు ముందుకు వెళ్తాయి. అందు కోసం బీజేపీ ఏదో ఒకటి చేయాల్సి ఉంది. ఏమిటనేదనిపై స్పష్టత లేదు. టీడీపీ, జనసేన డిమాండ్ చేస్తున్నట్లుగా వైసీపీ అవినీతిపై విచారణ చేయిస్తే.. పొత్తుల అంశంపై బీజేపీకి ఆసక్తి ఉంటే.. ఖచ్చితంగా పవన్ లేఖలపై స్పందిస్తుందని భావిస్తున్నారు. లేకపోతే వైసీపీతోనే లోపాయికారీ ఒప్పందాన్ని కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు.