ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలనుకుంటున్న పవన్ కల్యాణ్ అక్టోబర్ ఐదో తేదీని ముహుర్తంగా ఖరారు చేసుకున్నారు. ఇప్పటి వరకూ కౌలు రైతు భరోసా యాత్ర.. అలాగే జనవాణి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైరల్ ఫీవర్ రావడంతో మూడు వారాలుగా కార్యక్రమం ఆగిపోయింది. ఇక ముందు వాటిని కొనాగిస్తూనే.. యాత్ర ఏర్పాట్లు చేసుకుటున్నారు. దసరా పండుగ పూర్తయిన వెంటనే.. యాత్ర ప్రారంభించబోతున్నారు.
అప్పటి వరకూ ఎన్ని సినిమాల షూటింగ్లు జరిగితే అం వరకే. తర్వాత ఏమైనా ఉంటే ఎన్నికల తర్వాత చూసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. పవన్ కల్యాణ్ యాత్ర రూట్ మ్యాప్ .. ఇతర పార్టీలను నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. అన్ని ప్రాంతాలను వీలైనంత త్వరగా కవర్ చేయడంతో పాటు జనసేనకు ఎక్కువగా ఎక్కడ అవకాశాలు ఉంటాయా ఆ నియోజకవర్గాలపై ఎక్కున ఫోకస్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సారి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో తిరుపతి కూడా ఉంది. దీంతో పవన్ యాత్రను భారీగా విజయవంతం చేసి. ఏపీలో అధికారం చేపట్టడానికి రేసులో ఉన్న బలమైన పార్టీగా నిరూపించాలనుకుంటన్నారు. తమపై అనవసరంా విమర్శలు చేస్తున్న అధికార పార్టీకి కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నారు.