సినిమా అంతా తీసేశాక, సెన్సార్ కూడా అయిపోయాక, రిలీజ్‌కి ముందు ఎడిటింగ్ రూమ్‌లో కూర్చుని మళ్లీ రీ ఎడిట్ చేసి, సినిమా నిడివి తగ్గించి విడుదల చేయడం చూస్తూనే ఉన్నాం. ఈమద్య చాలా సినిమాలో రీరీ ఎడింటింగ్ చేసుకొన్నాయి. పాటలూ కత్తెరకు బలవుతున్నాయి. తీసిన సీన్లన్నీ చెత్త బుట్టలో చేరిపోయిన దాఖలాలు బోలెడున్నాయి. అయితే కాటమరాయుడుకి ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త తీసుకొంది చిత్రబృందం. స్క్రిప్టులో కొన్ని సీన్లు ముందుగానే కావాలని ఎడిట్ చేశారట. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. షూట్ చేసిన తరవాత, తప్పుని తెలుసుకొని కత్తిరించే ముందు ముందే ఎడిట్ చేస్తే… డబ్బులు, సమయం ఆదా అవుతుంది. రెండోది.. ఇప్పుడు కాటమరాయుడు చేతిలో అంత టైమ్ లేదు. తీయాల్సిన సీన్లు ఎక్కువున్నాయి.. టైమ్ తక్కువగా ఉంది. ఉగాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
అయితే… మరో 20 రోజుల షూటింగ్ బాకీ ఉంది. అందుకే… తీయాల్సిన సన్నివేశాల్లో కొన్నింటికి ముందుగానే ఎడిట్ చేసి సింపుల్‌లా లాగించేయాలని డిసైడ్ అయ్యార్ట. అంతే కాదు.. ఆల్బమ్‌లో ముందు అనుకొన్న పాటల్లో ఒకటి మిస్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. అనూప్ 5 పాటల్ని రికార్డ్ చేస్తే… అందులో 4 మాత్రమే షూట్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఒక పాటని ఆడియో సీడీకే పరిమితం చేస్తారట. దాంతో డబ్బులతో పాటు, సమయం కలిసొస్తుందన్నది టీమ్ ఐడియా. కట్ చేస్తే పాట.. అనుకొన్న టైపులో ఉన్న ఓ పాటని తెరకెక్కకముందే కట్ చేసేసినట్టు తెలుస్తోంది. మార్చి 28న ఉగాది. ఆ రోజుగానీ.. మార్చి 24న గానీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.