ఇలా మొదలెట్టారో లేదో… అలా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది.. ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. శ్రీలీల కథానాయిక. ఇటీవలే… హైదరాబాద్‌లో మొదలైంది. 8 రోజుల పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. దాంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ సీన్‌నీ, పిల్లలతో కామెడీ సీన్లనీ, శ్రీలీలతో రొమాంటిక్ సన్నివేశాల్ని తెరకెక్కించారు. 8 రోజుల్లో.. ఇన్నీ సీన్లు అయిపోయాయంటే.. సినిమా ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నట్టే. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెరకెక్కించిన యాక్షన్ సీన్ లో వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు, వంద మంది ఫైటరూ పాలు పంచుకొన్నారు. గబ్బర్ సింగ్ తరవాత వస్తున్న కాంబినేషన్ కావడంతో.. అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకొన్నారు. దానికి తగ్గట్టుగానే పవన్ క్యారెక్టరైజేషన్‌ని హరీష్ డిజైన్ చేసినట్టు టాక్. హరీష్ సింగిల్ లైనర్లు భలే ఉంటాయి. ఈ సినిమాలో అలాంటి డైలాగులు బాగానే పేలబోతున్నాయని తెలుస్తోంది. సుజిత్ తో పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ సినిమాకి బ్రేక్ రావడంతో సుజిత్ సినిమాలో జాయిన్ అవ్వబోతున్నాడు పవన్. ఆ తరవాత.. మళ్లీ `ఉస్తాద్ భగత్ సింగ్` రెండో షెడ్యూల్ మొదలవుతుంది.