పవన్ కల్యాణ్ రాజకీయ పర్యటనల కోసం సిద్ధం చేసుకున్న వాహనం రంగు చట్ట విరుద్ధమంటూ వింత వాదన చేస్తూ వస్తున్న వైసీపీ పరువు అడ్డంగా పోయింది. అలాంటి లెక్కలు తీసిన పేర్ని నాని వంటి వారికి కనీస అవగాహన కూడా లేదని రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తారని.. తెలంగాణ రవాణా శాఖ సింపుల్గా తేల్చేసింది. వారాహికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. TS13EX8384 నెంబరుతో రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.
తెలంగాణ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ తెలంగాణ పాపారావు పవన్ కల్యాణ్ వారాహి రంగు ఏ మాత్రం నిబంధనలకు విరుద్ధం కాదని స్పష్టం చేశారు. వాహనాలకు ఆలివ్ గ్రీన్ వాడొద్దని రూల్ ఉన్న మాట నిజమే కానీ.. వారాహి రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు నిర్ధారించారు. వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్ను పరిశీలించి.. ఆర్టీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలివ్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ మధ్య సిమిలారిటీ ఉందని.. అయితే రెండూ ఒకటి కాదని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో వైసీపీ నేతల వాదనలో అర్థం లేదని తేలిపోయింది.
గ్రీన్ లలో చాలా రకాలు ఉంటాయి. ఈ విషయం తెలిసి కూడా ఏదో వివాదం చేయాలని వారాహి వాహనం రంగుపై వైసీపీ వివాదం రేపినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ఆర్టీఏ అనుమతి ఇచ్చినందున ఇక ఏపీలోనూ అడ్డుకునే అవకాశం ఉండదు. ఆ వాహనం ఎక్కడ కనిపించినా.. వైసీపీ నేతలు.. క్యాడర్ గిల్టీ పిలింగ్కు గురి కావడం ఖాయమనుకోవచ్చు.