తిరుమల సంప్రదాయాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా డిక్లరేషన్ పై సంతకం చేశారు. క్రిస్టియన్ అయినప్పటికీ హిందువుల సంప్రదాయాలను గౌరవించారు. ఇదే సమయంలో జగన్ సతీమణి భారతి రెడ్డిపై చర్చ జరుగుతోంది. ఆమె తిరుమలకు ఎందుకు వెళ్ళరని, జగన్ దోవతి కట్టుకొని వెళ్లినా సతీమణి ఎందుకు కనిపించలేదన్నది ఇప్పుడు అందరి ప్రశ్న.
తాడేపల్లిలో తిరుమల సెట్ వేసి ఆధ్యాత్మికతను ఉట్టి పడేలా చేసిన జగన్ , భారతి రెడ్డిలు కలిసి తిరుమలకు ఎందుకు వెళ్లలేదు? రాష్ట్ర ప్రజాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఏకపక్షంగా ఓ మతం వైపు మొగ్గకూడదు అనే చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు జగన్? భారతిని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? అన్నా లెజినోవా తిరుమలలో తలనీలాలు సమర్పించాక జరుగుతోన్న చర్చ ఇది.
ఇటీవల శ్రీరామనవమికి తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు వారి సతీమణులతో పట్టు వస్త్రాలను సమర్పించారు. భద్రాద్రికి రేవంత్ తన భార్యతో , ఒంటిమిట్టకు ఏపీ సీఎం చంద్రబాబు తన కుటుంబంతో వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారు. పాలకులు కొన్నిసార్లు ప్రజలు అన్నింటినీ గమనించరని భ్రమపడుతారు. అందుకే ప్రజాభిప్రాయాలకు భిన్నంగా నడుచుకుంటారు.
తెలంగాణలో శ్రీరామనవమికి భద్రాద్రి రామయ్యకు ప్రభుత్వాధినేత తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. కేసీఆర్ హయాంలో మొదట్లో పట్టు వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత యాదాద్రికి కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. తను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని తర్వాత మనవడిని పంపారు. ఇది తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. జగన్ వ్యవహారశైలి కూడా ఏపీ ప్రజలకు నచ్చలేదు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే జనం ఊరుకోరు. ప్రతి విషయాన్ని గుర్తుంచుకుంటారు..