జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి యుద్ధప్రాతిపదిక కార్యచరణ మొదలుపెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. భాద్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన కార్యాలయంలోనే వుంటున్నారు. ప్రజల సమస్యలని వింటున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం చేపట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. అలాగే సలహాలు సూచనలని స్వాగతిస్తూ ఒక డిజిటిల్ ఫ్లాట్ ఫామ్, క్యూఆర్ కోడ్ ని ప్రొవైడ్ చేశారు.
భాద్యతలు చేపట్టాక తొలివంద రోజులకు సంబధించిన యాక్షన్ ప్లాన్ ని కూడా సిద్ధం చేశారు. ప్రభుత్వ శాఖలు, పాలనాపరమైన విధివిధానాలు, నిబంధనలు, పథకాలు, వాటి అమలు తీరుతో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? లేదా అనే విషయాలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేసుకున్న పవన్.. ఈ విషయంలో ఉద్యోగులు, నాయకులు అందరూ సమిష్టిగా పని చేయాలని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కావాలని కోరడం పవన్ పరిణితికి అద్దంపడుతోంది.
ముఖ్యంగా జనసేన నాయకులకు ఆయన ఇస్తున్న సలహాలు సూచనలు కొత్త ఒరవడికి శ్రీకారం చూట్టేలా వున్నాయి. సభల్లో కానీ ఇతర మరే వేదికలపై కానీ పరుష పదజాలం వాడొద్దని పార్టీ నాయకులకు బలంగా సూచించారు. భావంలో తీవ్రత వుండాలి కానీ మాటల్లో కాదని, ప్రతి ఒక్కరూ ప్రజల పట్ల వినయపూర్వకంగా వుండాలని, ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసే దిశగానే అడుగులు వుండాలని దిశానిర్దేశం చేస్తున్నారు పవన్. ఇలా చెప్పడమే కాదు.. పవన్ ఆచరించి చూపించారు కూడా. గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క వ్యంగ వాఖ్యానం కానీ, కఠినమైన పదం గానీ ఆయన నోటి నుంచి రాలేదు. చాలా హుందాగా మాట్లాడుతున్నారు పవన్.
మొత్తానికి భాధ్యతలు చేపట్టిన తక్షణమే శరవేగంగా ముందుకు కదులుతున్నారు పవన్. అధికారంలో వున్న ప్రతి రోజు అమూల్యమని గతంలో చెప్పిన తన అధికారంతో ప్రజలు ఎంతో మేలు చేయొచ్చనే అంశంపైన ఒక ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్లు ఆయన కార్యచరణ చూస్తుంటే అర్ధమౌతోంది.
పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వుండాలని, అలాంటి వ్యక్తి అధికారంలో వుంటే ఓ కొత్త మార్పు చూడొచ్చని చాలా మంది ఆశించారు. వారి ఆశలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు