2014లోనూ.. జగన్ సీఎం అవుతాడని.. కేసీఆర్ అదే పనిగా ప్రకటనలు చేశారు. కానీ అప్పుడేమయింది..?. ఇప్పుడు ఏపీకి జగన్ సీఎం కావాలని కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారు..? అవుతాడని ఎందుకు చెబుతున్నారు..?. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ సీఎం అయ్యే అవకాశమే లేదని.. కేసీఆర్‌కు తెలిసి కూడా.. ఎందుకు చెబుతున్నారు…? ఇది… జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అనుమానాలతో కూడిన…. రాజకీయాలపై వచ్చిన సమాధానాల్లాంటి … ప్రశ్నలు. పార్టీ నేతలతో.. సమీక్షలు ప్రారంభించిన పవన్ కల్యాణ్… ఫలితాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని.. ఆ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసని తేల్చేశారు.
ఓ వైపు.. వైసీపీ నేతలు.. అదే పనిగా.. తమకే అధికారం అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని.. బాణసంచా రెడీ చేసుకుంటున్న సమయంలో… కొంత మంది నుంచి .. అదెలా సాధ్యమనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి.. తనకు ఎందుకు అధికారం ఇవ్వాలో.. ఒక్కటంటే.. ఒక్క కారణాన్ని కూడా ప్రజల ముందు బలంగా ఉంచలేకపోయారని.. అలాంటప్పుడు.. ఓట్లు ఎందుకు వేస్తారన్న ప్రశ్న.. రాజకీయాలను.. పరిశీలించేవారికి సహజంగానే వస్తుంది. అదే పవన్ కల్యాణ్‌కూ వచ్చింది. అయితే.. పవన్ కల్యాణ్ ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు. ఆయనకు.. మొత్తం రాజకీయంపై అవగాహన ఉంటుంది. ప్రజల్లో తిరిగిన వ్యక్తి కాబట్టి… ఆయన అభిప్రాయానికి విలువ ఉంటుంది.
పవన్ కల్యాణ్ మాటలు.. అంత తీసిపారేయాల్సినవి ఏమీ కాదు… ఎందుకంటే.. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా.. కేటీఆర్… శుభాకాంక్షలు చెబుతూ.. ట్వీట్ చేశారు. అందులో.. ఆయన చంద్రబాబు మరింత కాలం పబ్లిక్ సర్వీస్‌లో ఉండాలని కోరుకున్నారు. జగన్‌కు మద్దతుగా.., అంతకు ముందు… కేటీఆర్ చేసిన ప్రకటలన్నీ… చంద్రబాబుకు రిటైర్మెంట్ ఖాయం అని… చెప్పే విధంగా ఉండేవి. అయితే.. ట్వీట్లో మాత్రం…ఆయన పబ్లిక్ సర్వీస్‌లో ఉంటారన్నట్లుగా చెప్పారు. అదే కేటీఆర్ మాటల్లో వచ్చిన తేడా..!. పవన్ కల్యాణ్ మాటలకూ… కేటీఆర్.. మాటలకూ.. ఏమైనా సంబంధం ఉంటే అది… మే 23వ తేదీ తర్వాత బయట పడుతుంది.