ఈతరం కథానాయకులు తెలివి మీరిపోయారు. పారితోషికం విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. కొత్త కొత్త పద్ధతులతో… తమ పారితోషికాన్ని అమాంతం పెంచేసుకొంటున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే బాట పట్టాడు. సాధారణంగా పవన్ కల్యాణ్ పారితోషికం రూ.15 నుంచి రూ.18 కోట్ల వరకూ ఉంటుంది. అత్తారింటికి దారేదికి పవన్ రూ.18 కోట్లు తీసుకొన్నా నిర్మాతకు ఓ మూడు కోట్లు వెనక్కి ఇచ్చేశాడు. అంటే పవన్ పారితోషికం రూ.15 కోట్ల దగ్గరే ఆగిపోయినట్టు. అందుకే సర్దార్ విషయంలో పవన్ కొత్త ప్లాన్ వేశాడు. పారితోషికం బదులుగా సినిమాలో వాటా అందుకొన్నాడు. అది బాగా వర్కవుట్ అయ్యింది.
సర్దార్ శాటిలైట్ హక్కుల్ని పవన్ తన దగ్గరే ఉంచుకొన్నాడని సమాచారం. ఆహక్కుల రూపంలో పవన్ రూ.12 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది. హిందీ రైట్స్ రూపంలో ఈరోస్ సంస్థ అందించిన రూ.12 కోట్లూ.. పవన్ ఖాతాలోకే వెళ్లాయని టాక్. అదీ కాక.. అడ్వాన్సు రూపంలో పవన్ రూ.5 కోట్ల వరకూ తీసుకొన్నాడట. అంటే.. దాదాపు రూ.29 కోట్ల రూపాయల్ని పవన్ ఆర్జించినట్టు. అదీ కాకుండా.. లాభాల్లో కూడా పవన్ వాటా పొందనున్నాడు. ఈ సినిమా రూ.75 కోట్లకు మించి వసూళ్లు రాబడితే… పవన్‌కి లాభాల్లో వాటా అందే అవకాశం ఉంది. ఆ రూపేణా మరో రూ.2 నుంచి 5 కోట్ల వరకూ ఆర్జించే అవకాశం ఉంది. సో.. పవన్ పారితోషికం రూ.30 కోట్లు దాటినట్టే. దాన్ని బట్టి అత్యధిక పారితోషికం తీసుకొంటున్న టాలీవుడ్ కథానాయకుల జాబితాలో పవన్.. నెం.1 అయిపోయినట్టే.