వ్యక్తిగత విమర్శలు చేస్తే దానికి డబుల్ రేంజ్ కౌంటర్లు వస్తాయని రాజకీయ నేతలకు తెలియదని అనుకోలేం. కానీ ఎదుటి వారిని కించపర్చి మానసిక ఆనందం పొందే నేతలు ఇటీవల అధికారాల్ని సైతం అనుభవిస్తున్నారు. అలాంటి వారికి అడ్డూ అదుపూ ఉండటం లేదు. సీఎం జగన్ ఆ కేటగిరిలోకే వస్తారు. ఉదయం ఆయన అమ్మఒడి పథకానికి పని చేయని బటన్ నొక్కేందుకు కురుపాంలో బహిరంగసభ పెట్టి పిల్లల ముందు పవన్ కల్యాణ్ ను కించ పరిచే ప్రయత్నం చేశారు. పవన్ ఊగిపోతూ మాట్లాడతారని..చెప్పారు. ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు. పవన్ వాహనంపైనా విమర్శలు చేశారు.
దీనికి పవన్ కల్యాణ్ తదనైన స్టైల్ లో కెంటర్ వచ్చారు. తాను ఊగిపోతూ మాట్లాడుతున్నానని జగన్ బాధపడిపోతున్నారని, ఇక నుంచి జగన్ స్టైల్ లోనే మాట్లాడతానని జగన్ స్టైల్ ను అనుకరిస్తూ చూపించారు. నిజానికి జగన్ చూసి కూడా సరిగ్గా చదవలేరు. కురుపాం సభలోనే ఆయన చూసి చదవలేక తంటాలు పడిన పదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన బాడీ లాంగ్వేజ్ అయితే … ఓవర్ యాక్షన్ అన్నట్లుగా ఉంటుంది. అలాంటి జగన్ ఇతరులను .. ఎలా ప్రసంగిస్తారన్న విషయంలో వెటకారం చేస్తే.. వారు ఆయనను ఇక ఏ రేంజ్ లో చేయాలి ? పవన్ కల్యాణ్ చేసేశారు కూడా. పవన్ ఇంకా జగన్ నోరు తిరగని వైనాన్ని కూడా చూపించి ఉంటే.. జగన్ అండ్ ఫ్యాన్స్ తల ఎక్కడ పెట్టుకోవాల్సి వచ్చేదోననే సెటైర్లు వినిపిస్తున్నాయి.
జగన్ వ్యాఖ్యలపై పవన్ ఘాటుగానే బదులిచ్చారు. తన వాహనంపై చేసిన విమర్శలు చూస్తే ఆయనకు సరిగ్గా అక్షరాలు కూడా రావాలని అర్థమైందన్నారు. సరిగ్గా అక్షరాలు రాని ముఖ్యమంత్రి ఉండడం తెలుగు రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని అన్నారు. వరాహికి.. వారాహికి కనీసం తేడా తెలియదా అని అన్నారు. తన దగ్గరకు వస్తే నేర్పుతానని కూడా చెప్పారు. తాను గతంలో చెప్పు తీసి చూపించి మాట్లాడానంటే దాని వెనక చాలా జరిగిందని అన్నారు. మొత్తంగా తనలో బోలెడంత నలుపు పెట్టుకుని ఎదురువాటిని విమర్శిస్తే… తాను స్వచ్చమని జగన్ అనుకుంటారేమో కానీ ఆయన నలుపును మాత్రం ఎప్పటికప్పుడు బయట పెట్టి కామెడీ చేస్తూనే ఉన్నారు ప్రత్యర్థులు.. సోషల్ మీడియా కూడా.