గబ్బర్ సింగ్ గుర్తిందిగా. నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అన్న పంచ్ డైలాగ్‌తో గబ్బర్ సింగ్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ టీజర్, అందులోని డైలాగ్ పవన్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించింది. ఆ డైలాగే… పవన్ ఫ్యాన్స్ ఇప్పటికీ గుర్తు చేసుకొని పదే పదే వల్లిస్తుంటారు. సర్దార్లో అలాంటి డైలాగులే ఉంటాయని ఆశించారు. టీజర్లో ఏం వినిపించకపోయినా, కనీసం ట్రైటర్లో అయినా.. పంచ్‌ల హవా కొనసాగుతుందని అనుకొన్నారు. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది,. సర్దార్లో పంచ్‌లు మిస్సయ్యాయి. దానికి కారణం కూడా తెలిసిపోయింది.
సాధారణంగా ట్రైలర్ అంటే కంపల్సరీ… ఓ పంచ్ డైలాగ్ పేలాల్సిందే. ఆఖర్లో… హీరోనో,.. కమెడియనో.. ఆ డైలాగ్ విసరకపోతే కిక్ ఉండదు. ఆ కిక్కే సర్దార్ గబ్బర్ సింగ్‌లో భారీగా మిస్సయ్యింది. పవన్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఫీలయ్యేది అదే. ట్రైలర్ అన్నీ ఉన్నాయి.. పంచే లేదు అని. అయితే… పవన్ కల్యాణ్ కావాలనే పంచ్ విసరలేదన్నది టాలీవుడ్ టాక్. ట్రైలర్ ని దగ్గరుండి మరీ కట్ చేయించిన పవన్.. పంచ్ డైలాగుల జోలికి వెళ్లొద్దని ముందే ఆర్డరు లాంటిది వేసేశాడట. మనకు కంటెంట్ ముఖ్యం,.. కటింగులు తరవాత.. అని తన టీమ్‌ని ప్రిపేర్ చేశాడట. పవన్ ఆదేశాలకు అనుగుణంగానే.. ట్రైలర్ కట్ అయ్యిందని చిత్రబృందం కూడా సీక్రెట్ విప్పేసింది.