జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ ఎంపీల తీరును .., వారి చేతకాని తనాన్ని ప్రజల ముందు పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన మూడు రోజుల పాటు జనసేన నేతలతో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహింప చేశారు. కొన్ని లక్షల ట్వీట్లను వైసీపీ ఎంపీలకు ట్యాగ్ చేసిన వారు కనీసం పార్లమెంట్లో ప్లకార్డులు కూడా పట్టుకోలేదు దీంతో పవన్ కల్యాణ్… గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల సమయంలో విశాఖ నేతలు ప్రాణాలు అర్పించైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.
ప్రాణాలు తీసుకునేంత త్యాగాలు చేయక్కర్లేదని పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుంటే చాలని పవన్ ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని పార్లమెంటులో వైసీపీ ఎంపీలు వినిపించాలని డిమాండ్ చేస్తూ జనసేన డిమాండ్ చేస్తోంది. కేంద్రానికి కోపం వచ్చేలా చిన్న పని కూడా చేయలేని పరిస్థితుల్లో వైసీపీ ఉందని నిరూపించాలన్న పట్టుదలతో పవన్ ఈ ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ప్రయత్నం సక్సెస్ అయింది.
కనీసం కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో చిన్న ప్రదర్శ కూడా చేయలేని పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు ఉన్నారని స్పష్టయింది. ఇప్పుడు వైసీపీ ఎంపీల్ని మరింతగా ప్రజలు కార్నర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలోనూ కేంద్రాన్ని వైసీపీ ఎంపీలు నిలదీయలేకపోవడం చర్చనీయాంశమవుతోంది.