పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ కల్యాణ్ స్పందించారు. ”అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విషయంలో సందిగ్ధంలో ఉన్న వారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారన్నారు. రాష్ట్రాన్ని అధోగతిపాల్జేస్తున్న తీరుకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారని.. . ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు అన్న పవన్.. ఈ ఫలితాలు వైకాపా ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వైసీపీది ప్రజా కంటక పాలన అని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలో రాకుండా ఉండటానికి చేయాల్సినదంతా చేస్తామని ప్రకటించారు. ఓట్లు చీలనివ్వబోమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనానికి వైసీపీకి తప్ప ఎవరికైనా ఓటేయమని పిలుపునిచ్చారు.