మళ్ళీ పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్!

హైదరాబాద్: ఆ కాంబినేషన్ అత్యంత ప్రభావవంతమైన కాంబినేషన్. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి సూపర్ డూపర్ హిట్‌లను ఇచ్చిన కాంబినేషన్. అలాంటి కాంబో మళ్ళీ కలిస్తే సంచలనమే! అలాంటి సంచలనానికి శ్రీకారం చుడుతోంది… ‘శ్రీమంతుడు’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మైత్రీ మూవీస్ సంస్థ. ‘శ్రీమంతుడు’ తర్వాత, ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన కొరటాల శివ దర్శకత్వంలోనే జూనియర్ ఎన్‌టీఆర్‌‍తో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. జూనియర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ పూర్తవగానే ‘జనతా గ్యారేజ్’ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే మూడో సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. ఇది కనుక వాస్తవ రూపు దాల్చితే మైత్రీ మూవీస్ టాలీవుడ్‌లో అగ్రసంస్థగా మారిపోతుందనటంలో ఏమాత్రం సందేహంలేదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం నితిన్‌,సమంతలతో ‘అఆ ఇఈ’ అనే సినిమాను రూపొందిస్తుండగా, పవన్ బాబి దర్శకత్వంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ‘కోబలి’ అనే సినిమా నిర్మించాలని అనుకున్నప్పటికీ అది పట్టాలపైకి రావటంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close