‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు” అని పవన్ కల్యాణ్ ఇటీవలతమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలపై స్పందిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. స్టాలిన్‌కు ఓ లేఖ కూడా రాశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ ట్వీట్ ఉంది. ఆ ట్వీట్ తమిళనాడులోనూ వైరల్ అయింది. అసెంబ్లీలో డీఎంకే సభ్యులు పవన్ కల్యాణ్ ట్వీట్ గురించి ప్రస్తావించారు. డీఎంకే ఎమ్మెల్యే తెలుగులోనే పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పెట్టిన పోస్టుని అసెంబ్లీలోనే చదివి వినిపించారు.
స్టాలిన్ సీఎం అయిన తర్వాత రాజకీయం చేయడం లేదని.. ఈ విషయాన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నానని పవన్ తాను చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మొత్తం తెలుగులో డీఎంకే ఎమ్మెల్యే చదివి వినిపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేలంతా నవ్వుతూ కనిపించారు. స్టాలిన్ కూడా చిరునవ్వుతో ఉన్నారు.
పవన్ కల్యాణ్‌తో పాటు చిరంజీవి కూడా స్టాలిన్‌ను అభినందించారు. చిరంజీవి అయితే నేరుగా వెళ్లి స్టాలిన్‌ను కలిసి వచ్చారు. స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుల జోలికి వెళ్లకుండా ప్రజాధనం ఆదా చేయడమే లక్ష్యంగా స్టాలిన్ పాలన సాగుతోందన్న అభిప్రాయంవినిపిస్తోంది. ఈ కారణంగానే పవన్ కల్యాణ్ తన స్పందన తెలియచేశారు. అది తమిళనాడు అసెంబ్లీలో హైలెట్ అయింది.