తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు, సోషల్ మీడియా మార్ఫింగ్‌లతో వారు అనుభవించినంత బాధ ఎవరూ అనుభవించి ఉండరు. అయినా తట్టుకుని నిలబడ్డారు వంగలపూడి అనిత. అదే సమయంలో తన నియోజకవర్గం పాయకరావుపేటలో పరిస్థితుల్ని సర్దుబాుట చేసుకుని అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించకుండా చేసుకున్నారు. గత ఎన్నికల్లో చాలా మంది వ్యతిరేకించడంతో కోవ్వూరుకు మార్చాల్సి వచ్చింది. అక్కడ ఆమె ఓడిపోయారు. మళ్లీ పాయకరావుపేటలోనే రాజకీయ భవితవ్యం వెదుక్కున్నారు.
పాయకరావుపేట టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతం. ఇప్పటి వరకూ ఏడుసార్లు తెలుగుదేశం పార్టీ, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యరర్థులు విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంగలపూడి అనిత విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన చెంగల వెంకట్రావుపై 2828 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొల్ల బాబూరావు విజయం సాధించారు. ఆయనకు రాజ్యసభ ఇచ్చి పంపించేసిన జగన్.. సిక్కోలు జిల్లా నుంచి రాజాం సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంభాల జోగులును పిలిపించి టిక్కెట్ ఇచ్చారు. ఎక్కడ రాజాం.. ఎక్కడ పాయకరావుపేట. !
పాయకరావుపేట రిజర్వుడు నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కాపు సామాజిక వర్గానిదే ఆధిపత్యం. నియోజకవర్గంలో కాపు, ఎస్సీ సామాజిక వర్గాలతోపాటు బీసీ వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఉన్న తీర ప్రాంతంలోని 18 మత్స్యకార గ్రామాల్లో ఉన్న మత్స్యకారుల ఓట్లు ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారుతుంటాయి. 2014లో తొలిసారిగా గెలిచిన అనిత.. వాక్ చాతుర్యంతో తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాడానికి ముందు టీచర్‌గా పనిచేశారు అనిత. మొదట్లో రాజకీయ నిర్ణయాలు తీసుకోలకే ఇబ్బందిపడినా ఇప్పుడు స్వతంత్రంగా గట్టిగా వ్యవహరించే నేతగా బలపడ్డారు. ఇప్పుడు ఆమె ఏ నేత మద్దతు అవసరం లేకుండా నియోజకవర్గంలో స్వతంత్రంగా పనిచేసుకోగలగుతున్నారు. ప్రజల్లో అనిత పట్ల వ్యతిరేక లేకపోవడం.. టీడీపీకి పాయకరావుపేటలో గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో అనితకు అనుకూల పరిస్థితి కనిపిస్తోంది.
వైసీపీలో చాలా గ్రూపులు ఉన్నాయి. అన్ని గ్రూపులు గొల్ల బాబూరావును వద్దనుకున్నాయి . అందుకే ఆయనను రాజ్యసభకు పంపారు. టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు ప్రయత్నించారు. ఆయన పేరును అసలు పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రి దాడిశెట్టి రాజా మద్దతుతో SC కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీకి కూా ప్రయత్నించారు. కానీ ఎవరికి ఇచ్చినా అందరూ పూర్తి స్థాయిలో పని చేసే పరిస్థితి లేదని ఎవరికీ తెలియని కంబాల జోగులుకు చాన్సిచ్చారు. ఆయన ప్రచారంలో వెనకుబడ్డారు. అనిత ఇప్పటికే నియోజకవర్గం అంతా చుట్టేశారు. ఈ సారి అనితకు పార్టీలో వ్యతిరేకత లేకపోవడం పెద్ద ప్లాస్ గా కనిపిస్తోంది.
మరో వైపు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అనకాపల్లి పరిధిలోకి వచ్చే పాయకరావుపేటలో బీజేపీ తరపున సీఎం రమేష్ పోటీ చేస్తున్నాయి. ఆయనకు పాయకరావుపేట నుంచి వచ్చే మెజార్టీ కీలకం కావడంతో ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటన్నారు. ఇలా అన్నీ కలసి వచ్చి వంగలపూడి అనిత మరోసారి అధ్యక్షా అనేందుకు సిద్ధమవుతున్నారని పాయకరావుపేటలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.