ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా చాలు. అదృష్టం పంట పండడానికి. అలాంటి సినిమా ఆర్.ఎక్స్ 100 తో దక్కింది పాయల్ రాజ్ పుట్‌కి. ఈ సినిమాకి ముందు ఆమె ఎవరో తెలీదు. ఈ సినిమా చూశాక మాత్రం ఆమె గురించి మాట్లాడుకోకుండా ఉండలేరు. బోల్డు సన్నివేశాలలో భలే నటించేసిందని పేరు తెచ్చుకుంది పాయల్. అలాంటి కథానాయికలు సౌత్ ఇండియాలో చాలా తక్కువ. కాబట్టి.. డిమాండ్ ఎక్కువగానే ఉండే ఛాన్సుంది. దానికి తగ్గట్టుగానే పాయల్కీ అవకాశాలొస్తున్నాయి. మీడియం సైజు హీరోలకు పాయల్ మంచి ఆప్షన్. కాకపోతే… ఈ అమ్మడి దృష్టి ఎక్కడో ఉంది. ”ఎవరితో కలసి నటించాలనుకుంటున్నారు?” అని అడిగితే…. చిన్నా చితకా పేర్లు చెప్పడం లేదు. స్టార్ హీరోల జాబితా మొత్తం బయట పెట్టేసింది. `పవన్, మహేష్, ప్రభాస్‌లతో కలసి నటించాలనివుంది` అంటోంది పాయల్. వీళ్లతో కలసి నటించే ఛాన్సుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోందట. పవన్ సినిమాలు తగ్గించేశాడు. ఇక మహేష్. ప్రభాస్‌లే కరుణించాలి. మీలో ఎవరి పోలికలు ఎక్కువగా ఉంటాయి? అని అడిగితే ”హీరోయిన్ నమ్రత ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. మా ఫ్రెండ్స్ అదే మాట చెబుతుంటారు” అంటోంది. సో.. ఈ లెక్కన మహేష్ దృష్టి తనపై పడొచ్చని ఆశ పడుతోందో… ఏమో..!!