ఆర్డిఎక్స్ లవ్‌తో హీరోయిన్ ఎంట్రీ సినిమాలకూ తానూ సరిపోతానని నిరూపించాలనుకుంది పాయల్ రాజ్‌పుత్. కానీ ఆ ప్రయోగం వికటించింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడం తన కెరీర్‌కి పెద్ద దెబ్బ. అయితే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై మాత్రం తన మక్కువ తగ్గలేదు. ఇప్పుడు అలాంటి కథనే మరోటి ఎంచుకుంది. ప్రణదీప్ అనే దర్శకుడితో ఓ సినిమా చేస్తోంది పాయల్. ఇందులో తాను ఐపీఎస్‌గా కనిపించనుంది. పోలీస్ పాత్రలంటే హీరోయిన్లకు చాలా ఇష్టం. వాటిలో హీరోయిజం చూపించాలని తాపత్రయపడుతుంటారు. అగ్ర కథానాయికలు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేటప్పుడు పోలీస్ కథల వైపు దృష్టి సారిస్తుంటారు. ఇప్పుడు పాయల్ కూడా అదే చేస్తోంది. ఈ సినిమాని తమిళంలోనూ విడుదల చేయాలని భావిస్తున్నారు. పాయల్ని ఇప్పటి వరకూ హాట్ హాట్‌గానే చూశారు తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఫైటింగులు కూడా చేయబోతోందన్నమాట. మరి ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో..?