లాక్ డౌన్ వల్ల… ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాల్సివచ్చింది. సినిమా వాళ్లు గడప దాటి బయటకు రావడం లేదు. వాంటా వార్పు లాంటి కార్యక్రమాలతో హీరోయిన్లు బిజీ అవుతున్నారు. ఇంకొంతమంది సోషల్ మీడియాలో చురుగ్గా కనిపిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రా, ట్విట్టర్లలో అభిమానులతో నేరుగా టచ్‌లో ఉంటున్నారు. అయితే.. వీళ్లందరికీ భిన్నంగా పాయల్ రాజ్ పుత్ ఓ ప్రయోగం చేసింది. ఇంట్లోనే ఓ షార్ట్ ఫిల్మ్ పూర్తి చేసేసింది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ స్పెషాలిటీ ఏమిటంటే.. కేవలం 24 గంటల్లోనే షూటింగ్ పూర్తయ్యింది. `ది రైటర్` అనే షార్ట్ ఫిల్మ్…కి సౌరభ్ దర్శకుడు. ఈ షార్ట్ ఫిల్మ్‌ని అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నార్ట. ఎంత షార్ట్ ఫిల్మ్ అయినా 24 గంటల్లో పూర్తి చేయడం విశేషమే. `ఆర్.ఎక్స్ 100` తరవాత పాయల్‌కి అవకాశాలొచ్చినా.. ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. `వెంకీ మామ` లాంటి సినిమాల్లో కనిపించినా, ఆమె పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కలేదు. అందుకే ఇప్పుడు మంచి ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తోంది.