సత్యదేవ్ మంచి జోష్ లో ఉన్నాడు. వరుసగా సినిమాల్ని ఓకే చేస్తున్నాడు. ఇటీవలే తిమ్మరిసు, గుర్తుందా శీతాకాలం మొదలయ్యాయి. ఇప్పుడు `గాడ్సే` సినిమాకి ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి గోపీ గణేష్ దర్శకుడు. సత్యదేవ్ – గోపీ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఇది వరకు వీరిద్దరి కాంబోలో `బ్లఫ్ మాస్టర్` వచ్చింది. ఆసినిమా సత్యదేవ్ పాత్రకి నెగిటీవ్ టచ్ ఇచ్చారు. `గాడ్సే`లోనూ సత్యదేవ్ ది నెగిటీవ్ రోలే అని తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయిక పేరు ఇప్పటి వరకూ ప్రకటించలేదు. అయితే కథానాయికగా పాయల్ రాజ్ పుత్ నటించే అవకాశం ఉందని టాక్. ఇందులో పాయల్ పాత్ర గ్లామరెస్గా ఉంటూ.. కొత్త కోణంలో సాగుతుందట. `గాడ్సే`గా సత్యదేవ్ పాత్ర లో ఎంత నెగిటీవ్ టచ్ ఉంటుందో.. పాయల్ పాత్రలోనూ అంతే వ్యతిరేక ఛాయలుంటాయని తెలుస్తోంది. త్వరలోనే కథానాయిక విషయంలో ఓ అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.