‘ఆర్.ఎక్స్ 100’ మినహా మరో విజయాన్ని రుచి చూడలేకపోయింది పాయల్ రాజ్‌పుత్. వచ్చిన స్టార్ డమ్ ని, అవకాశాల్నీ చేజేతులా పాడుచేసుకుంది. ఇది ముమ్మాటికీ తన స్వయంకృతాపరాధమే. వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాలు చేసినా – తనకంటూ ప్రత్యేకమైన పాత్రలు రాకపోవడంతో పాయల్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. `తప్పంతా నాదే..` అంటూ ఆత్మ విమర్శ చేసుకుంటూనే – ఈ విషయంలో ఒకరిద్దరు దర్శకులు కూడా తనని తప్పుదోవ పట్టించారని నిందిస్తోంది.
తన తప్పుడు నిర్ణయాల్లో ‘వెంకీ మామ’ కూడా ఉందని ఇటీవల మనసులో మాట బయటపెట్టింది. వెంకీ మామలో వెంకటేష్‌కి జోడీగా నటించింది పాయల్. అందులో టీచర్‌గా కనిపించింది. గ్లామర్ డోసు ఎక్కువైనా సరే – పాయల్ కి ఈ సినిమా ఎలాంటి బ్రేకూ ఇవ్వలేకపోయింది. ”ఈ సినిమాలో నేను మరీ ఆంటీలా కనిపించాను. అది నా అవకాశాల్ని దెబ్బతీసింది. యువ కథానాయకుల పక్కన అవకాశాలు రానివ్వకుండా చేసింది” అంటూ తెగ ఫీలైపోతోంది పాయల్. `వెంకీ మామ` తరవాత పాయల్ కి కొత్తగా అవకాశాలేం రావడం లేదు. బాలకృష్ణ – బోయపాటి కాంబోలో రూపొందుతున్న చిత్రంలో పాయల్‌కి ఛాన్సొచ్చినా – ఏవేవో కారణాలు చెప్పి తప్పుకుందని సమాచారం. సీరియర్ హీరోలతో నటిస్తే.. యూత్ హీరోలు పట్టించుకోరని బాగా భయపడి ఉంటుంది. ఇప్పుడు ఆ యూత్ హీరోలు సైతం పాయల్ని లైట్ తీసుకున్నారుగా. అటు సీనియర్ హీరోల సినిమాలూ చేయక, ఇటు యువ హీరోలూ అవకాశాలు ఇవ్వక.. పాపం పాయల్. గట్టెక్కేది ఎలా..? అయినా అంతా అయిపోయాక, ఇప్పుడు చింతిస్తే ఏం లాభం? సినిమాలు ఒప్పుకునే ముందే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సింది. ఇట్స్ టూ లేట్!