ప్రతిదానికీ ఓ లెక్క ఉంటుంది. సినిమాలోని ఫైట్లకు, మధ్య మధ్యలో వచ్చే పాటలకు, హీరోయిన్‌కి పెట్టే ముద్దులకు, షూటింగులో తీసుకున్న టేకులకు… ప్రతిదానికి ఓ లెక్క వుంటుంది. కానీ, ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ లెక్క పెట్టుకోలేదట. సినిమాలో ఎన్ని ముద్దులు వున్నాయనేది అసలు లెక్క పెట్టలేదని చెబుతున్నాడీ కొత్త కథానాయకుడు. రేపు రిలీజవుతోన్న ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఎంత ఘాటుగా వున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరో యారోగెంట్ క్యారెక్టరైజేషన్‌తో పాటు హీరోయిన్‌తో చేసిన రొమాంటిక్ సీన్లు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. హోర్డింగుల మీద లిప్ కిస్ పోస్టర్ అయితే ఆడియన్స్‌ని అట్ట్రాక్ట్ చేస్తోంది. అదొక్కటేనా? సినిమాలో ఇంకా ఎక్కువ లిప్ కిస్సులు వున్నాయా? అని హీరోని అడిగితే “ఎన్ని లిప్ కిస్సులు వున్నాయనేది లెక్క పెట్టుకోలేదండీ. స్క్రీన్ మీద చూస్తుంటే ఏదో కావాలని ముద్దు పెట్టుకున్నట్టు వుండదు. సన్నివేశానికి తగ్గట్టు వుంటుంది” అని చెప్పాడు. ట్రైలర్ విడుదల తరవాత చాలా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదట. సినిమా విడుదల వరకూ వెయిట్ చేస్తున్నాని చెప్పాడు.