బీజేపీ విజయవాడలో నిర్వహించతలపెట్టిన ప్రజాగ్రహసభపై వైసీపీ పెద్దగా స్పందించడం లేదు. కానీ టీడీపీ మాత్రం బీజేపీ తీరును ప్రశ్నిస్తూ మండిపడింది. బీజేపీ ప్రజాగ్రహ సభ ఓ బూటకం.. ఈ సంవత్సరానికి అతిపెద్ద జోక్ అని పయ్యావుల కేశవ్ తేల్చేశారు. దేశం లో పార్టీ కి జనసేన మిత్రపక్షం అయితే ఇక్కడ జగన్ పార్టీ మిత్రపక్షమన్నారు. ఇక్క కొనసాగుతోందని భారతీయ జగన్ పార్టీ అని సెటైర్ వేశారు. ఇటీవల ఓ ఎంపీ మాట్లాడుతూ కేంద్రం టెలిస్కోప్ లో చూస్తోందని చెప్పుకొచ్చారని.. అంతా లైవ్ కనిపిస్తోందన్నారు.
కేంద్రంలో నాయకత్వం కరెక్ట్ గానే ఉంది. రాజధాని అంశం పై అమిత్ షా చెబితే తప్ప ఇక్కడి వారు రాజధాని కి మద్దతు అంశం మర్చిపోయారని.. అందుకే్ జగన్ అనుగ్రహ సభ అంటే బాగుంటుందన్నారు. ప్రకాష్ జవదేకర్ కి ఒక్కటే చెబుతున్నానని ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేదు… భారతీయ జగన్ పార్టీ ఉందని స్పష్టం చేశారు. చైనా నుంచి వచ్చిన కరోనాకు మందు కనుక్కున్నాం కానీ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు మందు కనుక్కోలేదన్నారు. బీజేపీ బ్రాండ్ హిందుత్వం పై దాడులు జరుగుతుంటే ఇక్కడ ఆ పార్టీ మౌనంగా ఉంటుందని.. ధర్మకర్త అశోక్ గజపతిరాజు పై దాడి జరిగితే మౌనంగా ఉన్నారని..దేశం మొత్తంలో బీజేపీ మోడీ , షా ఆదేశాల తో పనిచేస్తుంటే ఇక్కడ జగన్ కనుసన్నుల్లో పనిచేస్తున్నారని విమర్శించారు.
ఓ ఎంపీ ని చంపే అంత పని చేశారు. ఓ బాబాయి ని చంపితే ఇప్పటికి నిందితులు ఎవరో తెలియదు. ఓ డాక్టర్ ని కొట్టి చంపితే అతిగతి లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అత్యాచారాలపై ఉన్నత స్థాయి లో విచారణ జరిపించే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం ముద్ర వెసుకుంటే… పంచాయతీ నిధులు వాడుకుంటే ఇక్కడి బీజేపీకి సమ్మతమని.. ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను అని చెప్పి.. యుద్ధం చేయకనే విరామం ప్రకటించిన వ్యక్తిని ముందు పెట్టుకొని యుద్ధం చేస్తున్న రని సోము వీర్రాజును ఉద్దేశించి పయ్యావుల సెటైర్లు వేశారు.