రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో అదానీ పవర్ నుంచి సెకీ ద్వారా యూనిట్ రూ. 2.49 పైసలకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేబినెట్లో ఒప్పందం చేసుకుంది. ఏకంగా 9వేల మెగావాట్లకు ఒప్పందం కావడంతో .. తెలుగుదేశం పార్టీ ఇది అతి పెద్ద స్కామ్ అని ఆరోపణలు చేస్తోంది. రూ. రెండు కన్నా తక్కువ ధరకు సెకీ యూనిట్ ఇస్తూంటే రెండున్నరకు కొనుగోలుచేయడం ఏమటని.. పైగా అసలు యూనిట్ ధర రూ. రెండున్నర కాదని ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసి రాష్ట్రానికి తీసుకువస్తారు కాబట్టి చార్జీలు ఇంకా ఎక్కువ అని.. అది కనీసం నాలుగున్నర అవుతుందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
రెండు రోజుల క్రితం ఇదే ఆరోపణలు చేసినప్పుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో ఓ ప్రెస్ నోట్ విడుదల అయింది. అందులో రూ. 2.49నేనని అతి తక్కువకు కొనుగోలు చేశామని తెలిపింది. అయితే ఆదివారం అయినప్పటికీ ప్రెస్మీట్ పెట్టిన ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్.. అసలు నిజం ఒప్పుకున్నారు.ఆ రూ. 2.49 కేవలం అదానీకి చెల్లించేదనని దాన్ని ఏపీకి రావడానికి ట్రాన్స్ మిషన్ చార్జీలు.. అలాగే నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంటుందని అది రూపాయిన్నర వరకూ ఉంటుందని తేల్చేశారు.
ఇది ఒక్క అదానీకే కాదని ప్రభుత్వం ఎవరి దగ్గర పవన్ కొన్నా చెల్లించాల్సిందేనని ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అలా చూస్తే మొత్తంగా అదానీ నుంచి కొన్న పవర్ ఏపీకి చేరే సరికి.. రూ. నాలుగు దాటిపోతోంది. టీడీపీ కూడా అదే ఆరోపిస్తోంది. ఏపీలో ఎందుకు ప్లాంట్లు పెట్టడం లేదని ప్రశ్నిస్తోంది. మొత్తానికి విద్యుత్ ఒప్పందాలు ఏపీ ప్రభుత్వ తీరుపై అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి.