రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో కర్నూలులో హైకోర్టు అంటూ.. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్కూల్, కాలేజీ పిల్లలు కొంత మంది డ్వాక్రా మహిళల్ని తరలించగలిగారు తప్ప.. జనం ఎవరూ రాలేదు. వచ్చిన వారు కూడా సభ ప్రారంభమైన వెంటనే వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్నే పయ్యావుల పరోక్షంగా గుర్తు చేశారు.
అసలు రాయలసీమకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డేనని పయ్యావుల స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తూంటే.. ఏపీ ప్రభుత్వం అసలు ప్రాజెక్టుల నిర్మాణం జోలికే వెళ్లడం లేదన్నారు. పరిశ్రమలను వెళ్లగొడుతున్నారని ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమకు కావాల్సింది నిధులు, నీళ్ళు, నియామకాలు. రాయలసీమ లో నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులు అడ్డుకున్నది… పరిశ్రమ లను తరిమేసింది మీరు కాదా? అని పయ్యావుల ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో సాక్షాత్తు ప్రభుత్వం పెట్టిన అడ్వకేట్ వేణుగోపాల్ అమరావతి లో హైకోర్టు ఉండాలి అన్నారు. ఇక్కడ గర్జనలు ఎంటి… ఎవరిని మోసం చేయాలని ఇక్కడ గర్జన అని పయ్యావుల ప్రశ్నించారు.
అనంతపురం అమరావతి ఎక్స్ ప్రెస్ గా ఉన్న దానిని కడప అమరావతి ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఆర్ టీ పీ పీ గతం లో ఎన్ టీ ఆర్ నిర్మించారు.. చంద్రబాబు విస్తరించారు. జగన్ ప్రభుత్వం లో మూసివేత దిశగా ఉంది. రాయలసీమకు చెందిన అమర రాజా పరిశ్రమను తరిమేశారు. మూడ్ ఆఫ్ ది రాయలసీమ పేరుతో చేపట్టిన సర్వే లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించడంతో సెంటిమెంట్ రగిలించెందుకే ఏర్పాటుకు గర్జన చేశారు. ఇక మనం చూడబోయేది ముందస్తు ఎన్నికలు మాత్రమేనన్నారు. ప్రభుత్వ అస్తితం కాపాడుకోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని పయ్యావుల జోస్యం చెప్పారు. మూడు రాజధానులకు బదులు మూడు రాష్ట్రాలు చేయాలని డిమాండ్ చేశారు.