కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. నారప్పతో తన ఖాతాలో మరో మంచి సినిమా పడింది. ఆ తరవాత ఎవరితో సినిమా చేస్తున్నాడు? ఏమా కథ? అని విషయాలు బయటకు రాలేదు. ఈలోగా గప్ చుప్‌గా ఓ సినిమా పూర్తి చేసేశాడు. ఈ సినిమాతో విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకి `పెద కాపు` అనే పేరు ఖరారు చేశారు. ఓ సామాన్యుడి సంతకం అనేది ఉపశీర్షిక. గోదావరి జిల్లాల్లో జరిగే ఓ పొలిటికల్ డ్రామా ఈ సినిమా. రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి భాగానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. అఖండ ఫేమ్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. మిక్కీ జే.మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ముకుందలో కూడా శ్రీకాంత్ అడ్డాల కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చాడు. కానీ పూర్తి స్థాయిలో ఓ పొలిటికల్ డ్రామా తీయడం ఇదే తొలిసారి. పైగా రెండు పార్టులుగా. ఈమధ్య పార్ట్ 2 సంస్క్రృతి బాగా వర్కవుట్ అవుతోంది. మరి ఈ పెదకాపు ఏం చేస్తాడో?