‘ఒకే పని సెసేనాకి… ఒకే నాగ బతికేనాకి… ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాల… పుడతామా యేటి మళ్లీ!’ అంటూ ‘పెద్ది’ ఫస్ట్ షాట్ తో కావాల్సిన బజ్ క్రియేట్ చేశాడు రామ్ చరణ్. పెద్ది పాత్రలో రామ్‌చరణ్ కొట్టిన షాట్, ఉత్తరాంధ్ర యాసలో సంభాషణలు, బుచ్చిబాబు టేకింగ్, రెహ్మాన్ బీజీఎం ఇవన్నీ పెద్ది ని మరోస్థాయిలో నిలిపాయి. తెలుగు టీజర్ 24 గంటల్లోపు 36 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది, ఇది సినిమా చుట్టూ ఉన్న హైప్ కి అద్దం పట్టింది.
ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు హిందీ షాట్ ని వదిలారు. తన పాత్రకు స్వయంగా రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. చరణ్ హిందీని పలికిన విధానం సహజంగా వుంది. తెలుగులోఉత్తరాంధ్ర యాస చెప్పారు. హిందీలో బిహారీ లోకల్ యాసని ఫాలో అయ్యారు. హిందీ ఫస్ట్ షాట్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. గేమ్ చెంజర్ చాలా అంచనాలతో పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్ళింది. కానీ డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు పెద్ది ఫస్ట్ షాట్ కి నార్త్ బెల్ట్ నుంచి వస్తున్న రెస్పాన్స్ టీంలో మంచి పాజిటివ్ ఎనర్జీని నింపుతోంది.