జగన్ రెడ్డి కుప్పం బాధ్యతలు ఇచ్చారు. మంత్రిగా పదవి ఇచ్చారు. కానీ మంత్రిగా చేయాల్సిందేమీ లేదని..కుప్పంలోనే ఉండాలని చెప్పారు. పైగా చాలా కాంట్రాక్టులు కూడా ఇచ్చారు. ఇప్పుడు కుప్పంలో లేకపోతే.. జగన్ రెడ్డి ఆగ్రహిస్తాడని .. తన నియోజకవర్గం… మంత్రిగా బాధ్యతలు ఉన్నా.. అన్నీ వదిలేసుకుని కుప్పం వీధుల్లో.. ఎమ్మెల్సీ భరత్ ను పెట్టుకుని తిరుగుతున్నారు.
భరత్ ను గెలిపించండి మంత్రిని చేస్తానని.. అదేదో పెద్ద ఆఫర్ అన్నట్లుగా చెబుతున్నా రు. టీడీపీ గెలిస్తే అక్కడ ముఖ్యమంత్రి ఉంటారని.. అక్కడి ప్రజలు మాజీ ముఖ్యమంత్రితో.. పదవిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రితో టచ్లో ఉంటారన్న సంగతిని పెద్దిరెడ్డి గుర్తుంచుకోలేకపోతున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టూరిస్టు బస్సులతో వచ్చిన గెలుపుతో విర్రవీగుతున్న వైసీపీ నేతలు…, రోడ్డున పడికొట్టుకుంటున్నారు. సైకోలుగా తయారయ్యారు. వారి దెబ్బకు కుప్పం ప్రజలంతా భయం భయంగా బతకాల్సి వస్తోంది.
పుంగనూరులో ప్రశ్నించిన వారి ఆస్తులను ధ్వంసం చేయడం… ఇళ్లపై దాడి చేయడం .. రౌడీయిజం చేయడం … పెద్దిరెడ్డి ప్లాన్. పుంగనూరులో ముఫ్పై వేల దొంగ ఓట్లు ఉన్నట్లుగా తేలింది. ఇన్ని అరాచకాలు చేసే పెద్దిరెడ్డికి కుప్పం పెద్ద టాస్క్ గా మారింది. భరత్ కోసం అంత కష్టపడే బదులు.. పెద్దిరెడ్డి పోటీ చేస్తే మంచిది కదా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.