అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో పెద్దిరెడ్డి, భరత్ కలిసి చేయని అరాచకం లేదు. భరత్ ను ముందు పెట్టి పెద్దిరెడ్డి అక్కడి వనరుల్ని కొల్లగొట్టి రౌడీయిజాన్ని పెంచి.. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. చంద్రబాబును ఓడిస్తానని సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వారు చేసిన నిర్వాకాలు.. ఆ తర్వాత చేసిన పనుల కారణంగా ఇప్పుడు ఎవరూ కుప్పంలో బతకలేని పరిస్థితి వచ్చింది. పార్టీ ఓడిపోయిన వెంటనే సగం మంది క్యాడర్ పారిపోతే.. సగం మంది టీడీపీకి లొంగిపోయారు. పారిపోయిన వారిలో ఇంచార్జ్ భరత్ కూడా ఉన్నారు.
హైదరాబాద్లో శాశ్వత నివాసం ఉండే భరత్ … వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనదై రాజ్యమన్నట్లుగా చెలరేగిపోయారు. అరాచకశక్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతల్ని ఎంతలా వేధించాలో అంతగా వేధించారు. చంద్రబాబు పర్యటనకు వస్తే రాళ్లు వేశారు. చంద్రబాబు టూర్ కు వస్తే బాంబులేస్తానని ప్రకటించారు. ఇంత చేసిన తరవాత తాము నియోజకవర్గంలో ఉంటే కష్టమని పారిపోయారు.
విచిత్రం ఏమిటంటే.. పెద్ద చించేస్తామని చెప్పి అందర్నీ రెచ్చగొట్టిన పెద్దిరెడ్డి అసలు పట్టించుకోవడంలేదు. అండగా ఉండాల్సిన భరత్ అసలు కుప్పం వైపు రావడం లేదు. వారే రాకపోతే ఇక మగిలిన వారికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది. అందుకే భరత్ కనిపించడం లేదని వారే కోపంతో నియోజకవర్గంలో పోస్టర్లు వేస్తున్నారు.