వైసీపీ మాజీ నెంబర్ టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడవుల్ని కూడా కొల్లగొట్టేసినట్లుగా ఈనాడు పత్రిక సంచలన కథనాన్ని వెల్లడించింది. మంగళం పేట అడవుల్లో ఆయన ఫామ్ హౌస్ నిర్మించుకున్న తీరు.. అక్కడికి మార్కెట్ కమిటీ నిధులతో రోడ్డు వేయించుకున్న వైనం కూడా వెల్లడి చేసి ప్రజలందర్నీ ముక్కును వేలేసుకునేలా చేసింది.
పెద్దిరెడ్డి పెద్ద దోపిడీదారుడు అని అందరికీ తెలుసు కానీ ఇంత బహిరంగంగా అడవినే తన పేరున రాసుకుని గెస్ట్ హౌస్ కట్టేసుకుంటారని ఎవరూ అనుకోలేరు. కానీ ఆయన చేశారు. మంగళం పేట అడవుల్లోతనకు భూమి ఉందని రికార్డులు సృష్టించి..దాన్ని అంత కంతకూ పెంచుకుంటూ పోయారు. చివరికి 70 నుంచి వంద ఎకరాల వరకూ తేల్చారు. అందులో విలాసవంతమైన ఓ గెస్ట్ హౌస్ కట్టారు. పెద్ద పెద్ద గోడౌన్ల లాంటి పశువుల పాకలు కట్టారు. కరెంట్ సౌకర్యం కల్పించుకున్నారు. అంతకు మించి అడవిలో తారు రోడ్డు కూడా మార్కెట్ కమిటీ నిధులతో వేసుకున్నారు.
ఈ వ్యవహారాన్ని ఈనాడు పత్రిక పూర్తి సాక్ష్యాలతో బయట పెట్టింది. గతంలో సజ్జల కుటుంబీకులు కడప జిల్లాలో చేసిన కబ్జాల గురించి ఆంధ్రజ్యోతి బయట పెడితే చర్యలు తీసుకునేందుకు పవన్ రెడీ అయ్యారు. ఇప్పుడు పెద్దిరెడ్డి చేసిన అడవిలో కబ్జా గురించి పవన్ ఇంకా సీరియస్ గా స్పందించే అవకాశం ఉంది. నేరుగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. రికార్డులు ట్యాంపరింగ్ చేసిన వారిని అరెస్టు చేయించి.. పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పంచాయతీరాజ్ , అటవీ శాఖా మంత్రిగా పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు . చిన్న కబ్జాలనూ వదిలి పెట్టడం లేదు. అందుకే పెద్దిరెడ్డి ఈ సారి తప్పించుకోలేడన్న వాదన వినిపిస్తోంది.