వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన పెద్దిరెడ్డి అనుచరుల బాగోతం మెల్లగా బయటకు వస్తోంది. బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదులు చేస్తుండటంతో ఈ కబ్జాల పర్వం నివ్వెరపోయేలా చేస్తోంది. మరోవైపు..మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దహనం కేసులో ఇటీవల పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోగా..తాజాగా భూకబ్జా కేసులో ఆయన పీఏ శశికాంత్ ను అదుపులోకి తీసుకున్నారు.
పెద్దిరెడ్డి అనుచరులు, వ్యక్తిగత సహాయకులు దోపిడీకి పాల్పడ్డారంటే..ఈ వ్యవహారం పెద్దిరెడ్డికి తెలియకుండా జరిగే అవకాశం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ కేసులో పెద్దిరెడ్డి సైతం విచారణ ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. మదనపల్లి దస్త్రాల దహనం కేసులో పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నా..పెద్దిరెడ్డి మాత్రం మౌనం వీడటం లేదు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు కూడా మీడియా ముందుకు రావడం లేదు.
Also Read : జగన్కు ఝలక్.. వాళ్లూ జారుకుంటున్నారు!
పెద్దిరెడ్డి కనీసం రాజకీయపరమైన విమర్శలు కూడా చేయకపోవడం పట్ల పెద్ద చర్చ జరుగుతోంది. అయితే, ఈ కేసులో పెద్దిరెడ్డి అనుచరుల పాత్రపై ప్రాథమిక ఆధారాలు పోలీసులకు లభ్యం కావడంతో ఇప్పుడు పెద్దిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అవన్నీ ఆయన మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదు.
ఇప్పుడు పెద్దిరెడ్డి పూర్తిగా ఇరుక్కుపోయరని.. ఈ సమయంలో ఏం మాట్లాడినా అది మరింత కటకటాల్లోకి నెట్టేస్తుంది అన్న ఆలోచనతోనే అనుచరుల అరెస్ట్ జరుగుతోన్నా స్పందించడం లేదని తెలుస్తోంది. పెద్దిరెడ్డి నిస్సహాయతను గ్రహించే ఇటీవలే జగన్ ఈ అంశంపై స్పందించారని అంటున్నారు.