మాజీ మంత్రి పెద్దిరెడ్డి. వైసీపీలో అనధికార నెం.2 నాయకుడు. విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల ఇలా ఎంత మంచి ఉన్నా… జగన్ ప్రియారిటీలో వీరిలో ఎవరు ముందున్నా, వెనకున్నా… పెద్దిరెడ్డి మాత్రం స్పెషల్. ఇక చిత్తూరు పరిసర జిల్లాల్లో తన మాటే ఫైనల్.
అధికారంలో ఉండగా తన అనుచరుల దోపిడీ, వ్యవస్థల్లో లొసుగులు వాడుకొని తన కుటుంబ సభ్యుల కంపెనీలకు భారీగా దోచిపెట్టారన్న ఆరోపణలు కోకొల్లలు. ఎన్నో ఏళ్లుగా తన సామ్రాజ్యం విస్తరిస్తూ వస్తున్నా… కత్తెరలు పడలేదు. కానీ, ఫస్ట్ టైం తన పునాదులు కదిలేలా ఉన్నాయన్న అభిప్రాయం తన సొంతూరు పుంగనూరులోనూ బలంగా వినిపిస్తోంది.
పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేసిన శాఖలపై ఇప్పటికే విచారణ శరవేగంగా జరుగుతోంది. తన సొంతూరులోనే వందల ఎకరాల భూమాయ జరిగిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్న దశలో… మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైల్స్ దగ్ధం కేసు ఆయన మెడకే చుట్టుకునేలా కనపడుతోంది. తన కీలక అనుచరులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ జరుగుతున్న తీరును ప్రభుత్వ పెద్దలు మానటరింగ్ చేస్తుండటంతో చిక్కులు తప్పేలా లేవు. మరోవైపు తన భార్య ఆస్తులు ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించలేదని, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ కేసులు పడ్డాయి.
Also Read : అన్ని లెక్కలు తేల్చేస్తున్న చంద్రబాబు!
వీటన్నింటికి తోడు పెద్దిరెడ్డి వచ్చినా ఆయన కొడుకు మిథున్ రెడ్డి పుంగనూరు వచ్చినా స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నిజానికి ఈ ఎన్నికల్లో జగన్ క్యాబినెట్ లో గెలిచిన ఏకైక మంత్రి పెద్దిరెడ్డే. తృటిలో ఓటమి నుండి బయటపడ్డారు. కొన్ని పొరపాట్లు చేశారు లేకుంటే ఆయన కూడా అసెంబ్లీ గేటు తాకకపోవు అని చంద్రబాబు అన్నారంటేనే విషయం అర్థం చేసుకోవచ్చు.
ఇలా మైనింగ్, ఇసుక అక్రమాలు, పర్యావరణ అనుమతుల్లో అవకతవకలతో పాటు అవినీతి అంతా చుట్టుముడుతుందని… ఈసారి పెద్దిరెడ్డి తప్పించుకోలేరన్న చర్చ ఇటు వైసీపీలోనూ, అటు పుంగనూరులోనూ బలంగా వినిపిస్తోంది.