పుంగనూరులో అడుగుపెట్టాలంటే చంద్రబాబుకైనా సరే వందల మంది సెక్యూరిటీ ఉండాలనేలా రాజకీయం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు భయం పట్టుకుంది. పుంగనూరులోనే కాదు.. చంద్రబాబుపై కుప్పంలోనూ రాళ్లేయించిన రికార్డు ఆయనది. ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. తనకు సెక్యూరిటీ పెంచాలని ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ వేశారు. తనకు ఫైవ్ ప్లస్ ఫైవ్ భద్రత ఉండేదని ఇప్పుడు తీసేశారని ఆయన కోర్టుకు చెప్పుకున్నారు.
అయితే పెద్దిరెడ్డి ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని ఆయన గతంలో మంత్రిగా ఉండేవారు కాబట్టి ఆ స్థాయి భద్రత ఉండేదని ప్రభుత్వలాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎవరికి ఎంత భద్రత ఇవ్వాలన్నదానిపై పోలీసు శాఖ సెక్యూరిటీ రివిజన్ చేసి.. నిర్ణయిస్తుందన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి ఎమ్మెల్యే మాత్రమేనని అందుకే వన్ ప్లస్ వన్ కేటాయించారన్నారు. ఈ అంశంపై హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
పెద్దిరెడ్డి సంస్కారవంతమైన రాజకీయాలు చేసి ఉంటే ఆయనకు ఈ భయం ఉండేది కాదు. పుంగనూరులో కొంత మంది రౌడీల్ని పెంచి పోషించి.. వారితో తమ రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయించారు.ఇప్పుడు పరిస్థfతి తిరగబడటంతో ఎవరో వచ్చి దాడి చేస్తారోనన్న భయంతో బతుకుతున్నారు. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కూడా తమకు భద్రత కల్పించాలని పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు.