మంత్రి పెద్దిరెడ్డికి ఎన్ని వేల కాంట్రాక్టులు దక్కాయో కానీ.. అటు కుప్పం.. ఇటు హిందూపురం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలందర్నీ కొనేయాలని జగన్ రెడ్డి హుకుం జారీ చేసినట్లుగా కనిపిస్తోంది., కుప్పంలో ఇప్పటికే చాలా చేశారు. ఇప్పుడు హిందూపురంపై దృష్టి పెట్టారు. అక్కడ దీపికారెడ్డి అనే ఆమెను ఇంచార్జులుగా నియమింపచేసిన పెద్దిరెడ్డి.. తనకు చెందిన ఓ వ్యక్తిని హిందూపురంలోనే తిష్ట వేయించారు. ఆ వ్యక్తి… హిందూపురంలో అన్ని గ్రామాలు తిరుగుతూ.. టీడీపీ క్యాడర్ తో బేరాలు ఆడుతున్నారు.
వైసీపీలో చేరితే ఇప్పటికిప్పుడు లక్షలు ఇస్తామని బేరాలాడుతున్నారు. కాదూ కూడదన్న వారిపై పోలీసులతో బెదిరింప చేస్తున్నారు. అన్నీ చేసి… ఓ జాబితా తయారు చేసుకుని.. మూడు రోజుల పాటు చేరికల కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. పెద్దిరెడ్డి బెదిరింపులు, కొనుగోళ్ల రాజకీయాల్ని హిందూపురం తీసుకు రావడంతో చాలా మంది టీడీపీ నేతలకు లక్షలు వచ్చి పడుతున్నాయి. అయితే అప్పటి వరకూ ఉన్న వైసీపీ నేతలకు కోపం వస్తోంది. తమను కాదని వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ తీసుకుంటారా అని ఫైర్ అవుతున్నారు.
పెద్దిరెడ్డి రాజకీయానికి విరుగుడు.. బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురంలో టీడీపీ నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. వారేదో లక్షలు ఇస్తామంటారని…. పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మారిపోతే… నష్టపోతారని చెబుతున్నారు. మీరు ఆ పార్టీలోకి వెళ్తే మీ ప్రత్యర్థులు టీడీపీలోకి వస్తారని అనివార్యంగా వారికి ప్రోత్సాహం ఇవ్వాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో వెళ్తామనే నేతల్ని ఆయన ఒత్తిడి చేయడం లేరు.. వారు వైసీపీలోకి వెళ్తే అక్కడ నష్టపోయేవారిని టీడీపీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
డబ్బులతో ఏదైనా చేయవచ్చని.. కాదంటే బెదిరించవచ్ననేది పెద్దిరెడ్డి ప్లాన్. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని తాము డిక్టేట్ చేయగలమనుకుంటే… వారికి అధికార మదం పూర్తిగా తలకెక్కేసినట్లేనని.. ప్రజలే దింపుతారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.