లెక్కలేనన్ని ఆరోపణలు చేశారు కానీ చర్యలు తీసుకోవడం లేదు అని .. అక్రమార్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేస్తున్నారు. ఓ వైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అరాచకాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇసుక, మైనింగ్, మద్యం స్కాములే కాదు.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి కుటుంబీకులు చేసిన భూకబ్జాలపై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. మదనపల్లి పైల్స్ తగలబడినప్పుడు ఆయనపై వందల ఫిర్యాదులు వచ్చాయి.కానీ ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. అందుకే పెద్దిరెడ్డి సవాళ్లు చేస్తున్నారు. దమ్ముంటే చర్యలు తీసుకోవాలంటున్నారు.
అంగళ్లలో చంద్రబాబును చంపడానికి పెద్దిరెడ్డి భయంకరమైన కుట్ర చేశారు. రాళ్ల దాడులు చేయించారు. అక్కడ విఫలమయ్యే సరికి పుంగనూరులో దాడులకు పాల్పడ్డారు. అక్కడ టీడీపీ నేతలు తిరగబడ్డారు. దీంతో కొన్ని వందల మందిపై కేసులు పెట్టారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రైవేటు సైన్యం చేసే అరాచకాలు ఎన్ని ఉండేవో అందరికీ తెలుసు. ఆయన సొంత ఇంటికి కూడా రూపాయి ఖర్చు పెట్టరు. ప్రజా ధనంతోనే రోడ్లు ఇతర పనులు చేయించుకుంటారు. ఆయన అక్రమాల గురించి లెక్క తీయాలంటే.. గంటల్లోనే పెద్ద పెద్ద పుస్తకాలు రెడీ అయిపోతాయి.
ఆయనపై చర్యల విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో కానీ.. ఆయన కు కొంత మంది టీడీపీ ముఖ్యులతో.. సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో వారు తప్ప అందరూ ఓడిపోవడానికి.. టీడీపీ గెలవడానికి ఆయన పరోక్ష సహకారం ఉందని.. వైసీపీలోనూ చర్చించుకుంటున్నారు. ఇదంతా అబద్దమని ప్రజలకు సంకేతాలు ఇవ్వడానికైనా.. పెద్దిరెడ్డి పాపాలను బయటకు తీసి చర్యలు తీసుకోవాల్సిందే. ఆయన మాఫియా రాజ్యాన్ని అణిచి వేసి..కబ్జాల నుంచి ప్రజల్ని కాపాడాల్సిందే. లేకపోతే అది ప్రభుత్వ చేతకాని తనం అవుతందని చెప్పాల్సిన పని లేదు.