పుంగనూరు నియోజకవర్గంలో మంగళం అటవీ ప్రాంతంలో 75 ఎకరాలను పెద్దిరెడ్డి కబ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్న వైనంలో మీడియాలో వచ్చిన వార్తను పెద్దిరెడ్డి ఖండించారు. వాటిని తాను చాలా ఏళ్ల క్రితం కొన్నానని చెప్పుకొచ్చారు. అడవిలో భూముల్ని అమ్ముతామంటే ఎలా కొన్నారని అంటారని.. అప్పట్లో అధికారులు అవి అటవీ భూములు కాదని తేల్చారని చెప్పుకొచ్చారు. తాము 75 ఎకరాలను కొని రిజిస్టర్ చేసుకున్నామని చెబుతున్నారు.
మరి అడవిలో అంత పెద్ద గెస్ట్ హౌస్ ఎలా కట్టారు.. అనుమతి ఉందా అన్న ప్రశ్నలకు ఆయన విచిత్రమైన సమాధానం ఇచ్చారు. అది పని వాళ్ల కోసం కట్టిందట. మరి మార్కెట్ కమిటీ నిధులతో ఎందుకు రోడ్డు వేసుకున్నారంటే ఆయన వద్ద సమాధానం లేదు. పచ్చ పత్రికలు ఆరోపణలు చేస్తున్నాయని పరువు నష్టం దాఖలు చేస్తానని బెదిరించి వెళ్లిపోయారు. పెద్దిరెడ్డి భూ కబ్జాలు చిన్నవి కావని ఆనకొండలా జిల్లా మొత్తం పాకిపోయాయని రికార్డులు వెలుగులోకి వస్తున్నాయి.
తనపై ఆరోపణలు చేస్తున్నారని కానీ చర్యలు తీసుకోవడం లేదని.. పెద్దిరెడ్డి అంటునన్నారు. ఇసుక స్కాంలో తన పాత్ర ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. పెద్దిరెడ్డి ఇసుక, మైనింగ్, ఆయన కుమారుడు మద్యం స్కాముల్లో ప్రధాన పాత్రధారులు. ఏడు నెలలు గడుస్తున్నా ఇంకా చర్యలు తీసుకోకపోవడంతో ఆయన కూడా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని..తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు.