పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాను అడ్డగోలుగా దోచుకుందని .. వారి నిర్వాకాలు ఇవేనంటూ ఈనాడు దాడి చేస్తూండటంతో వారికేం చేయాలో అర్థం కావడం లేదు. అందులో నిజాల్లేవు అని చెప్పడానికి వారికి ధైర్యం రావడం లేదు. కానీ బెదిరిస్తే ఏమైనా తగ్గుతారేమో అని మార్గదర్శి పేరుతో ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి మార్గదర్శి పై విచారణ చేయాలని పార్లమెంట్ ఎదుట డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్ ను చూసి పాపం అనుకున్నారు టీడీపీ ఎంపీలు.
మార్గదర్శి పేరుతో ఈనాడుపై ఎంతో కాలం నుంచి ఎటాక్ చేస్తున్నారు. ఆ ఎటాక్ ను ఈనాడు సమర్థంగా ఎదుర్కొంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో పెట్టుబడి పెట్టిన వారందరికీ డబ్బులు ఇచ్చేసింది. క్లెయిమ్ చేసుకోని వన్ పర్సంట్ ఎస్క్రో ఖాతాలో ఉందని కోర్టులు కూడా చెప్పాయి. ఇప్పుడు వివాదమే లేదు. ప్రభుత్వాలు కూడా ఈ కేసును కొనసాగించడానికి ఆసక్తి చూపించడం లేదు. కానీ ఉండవల్లి మాత్రం.. తన రాజకీయ బాసుల ఆత్మసంతృప్తి కోసం పిటిషన్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మిథున్ రెడ్డి అదే ఆయుధం తీసుకున్నారు. కానీ మార్గదర్శి మీద జగన్ రెడ్డి నేరుగా ఎటాక్ చేసినా.. తప్పుడు కేసులు పెట్టినా ఈ సంస్థ చలించలేదన్న సంగతిని మర్చిపోయారు.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి .. జగన్ రెడ్డి కోసం మద్యం స్కాంలో ఎలా మనీరూటింగ్ చేశారో చాలా సింపుల్ గా ఈనాడు బయట పెట్టింది. ఆధారాలతో సహా త్వరలో మరిన్ని కథనాలు సీరియల్ గా రాబోతున్నాయని చెబుతున్నారు. దీనికే మిథున్ రెడ్డి ఆవేశపడితే.. రాబోయే రోజుల్లో ఆవేశపడటానికి అంతగా అవకాశం లభించదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. దోపిడీలు చేసి..దాన్ని బెదిరించి కవర్ చేసుకుందామంటే ఎల్ల కాలం సాధ్యం కాకపోవచ్చని ఎన్నో సార్లు రాజకీయ పరిణామాలు నిరూపించాయి.