‘నా పేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన వినోద్ కిషన్ ఇప్పుడు హీరోగా మారాడు. ఆయన నటించిన ‘పేక మేడలు’ ఈనెల 19న విడుదలకు సిద్ధంగా ఉంది. అనూష కృష్ణ హీరోయిన్. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ ”ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలకి దగ్గరగా ఈ సినిమాను చూపిస్తున్నాం. జంధ్యాల గారి స్టైల్ ఆఫ్ కామెడీ తో పాటు ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తార”న్నారు. నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ ”డైరెక్టర్ నీలగిరి కథ ఎలా చెప్పారో అలాగే చాలా బాగా తీశారు. వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో ప్రమోషన్ స్టార్ట్ చేసాం అది పెద్ద సక్సెస్ అయింది. ఇంకా సినిమా రిలీజ్ వరకు ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాం. ఇది ఒక కామెడీ సినిమా మాత్రమే కాదు ఇందులో ఆడవారు మగవారికి ఇస్తున్న సపోర్ట్ గురించి ఒక కోర్ పాయింట్ తో మంచి కాన్సెప్ట్ సినిమాని తీసాం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ గా కూడా ఉంటుంద”న్నారు.