గుంటూరు నగరం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది కానీ మౌలిక సదుపాయాలు మాత్రం ఎక్కడివక్కడే. దశాబ్దాల కిందట కట్టిన ఫ్లైఓవర్లు ఇరుకుగా మారిపోయాయి. కార్లు ఉంటే కుబేరులు అనుకున్న రోజుల్లో కట్టిన ఫ్లైవర్లు ఇప్పుడు .. కారు కామన్ అయిపోయిన రోజుల్లో ఇలా ఎలా కట్టారబ్బా అనుకునే పరిస్థితి. అలాగే డొంకరోడ్ వద్ద మూడు వంతెనలు, శంకర్ విలాస్ ఫ్లైఓవర్ గుంటూరు ప్రజలకు అతి పెద్ద సమస్యలు. వీటిని అభివృద్ది చేయాలని ఏళ్లుగా అడుగుతున్నారు కానీ ఎవరి వల్ల కాలేదు.కానీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రయారిటీగా తీసుకుని కేంద్ర మంత్రిగా అవకాశం రాగానే మంజూరు చేయించుకుని వచ్చారు.
శంకర్ విలాస్ సెంటర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఎప్పుడో దశాబ్దాల కిందట కట్టిన ఫ్లైఓవర్.. చుట్టూ అనేక వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మిషనరీ సంస్థలు ఉన్నాయి. వాటన్నింటికీ నుంచి భూమిని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మూడు వంతెనల దగ్గర పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. వర్షం పడితే ఆ మూడు వంతెనల కిందట ఆరేడుఅడుగుల ఎత్తులో నీరు నిలిచిపోతుంది. ఆ సమస్యను పరిష్కరిస్తే.. ట్రాఫిక్ సమస్య దాదాపుగా తీరిపోతుంది.
గుంటూరుకు సంబంధించి..కేంద్రంతో సంబంధం ఉన్న పలు పనుల్ని.. పెమ్మసాని ప్రయారిటీగా తీసుకుని పరిష్కరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రోడ్ల సమస్యను ఇప్పటికే పరిష్కరించారు. గుంటూరు అంతా మంచి రోడ్లు వేశారు. కాలనీల్లో సిమెంట్ రోడ్లు కూడా వేస్తున్నారు. అటు కేంద్రంతో.. ఇటు రాష్ట్రంతోనూ పనులు చేయించుకుని ప్రజా ప్రతినిధులు ..గుంటూరుకు కళ తీసుకు వస్తున్నారు.